hyper Aadi interesting comments about Anasuya

Anasuya: స్మాల్ స్క్రీన్ కమెడియన్గా తన కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం అంచలంచలుగా ఎదుగుతూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం స్టార్ హీరోలపై కూడా పంచెస్ వేస్తూ చాలా జోయల్ గా తన లైఫ్ను లీడ్ చేస్తున్నాడు. మొదటయిన జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రామ్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

hyper Aadi interesting comments about Anasuya

తన కామెడీ డైలాగులతో టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇక కొంతకాలం క్రితమే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్కు దూరమైనప్పటికీ ప్రజెంట్ టెలివిజన్ షోలతో ఫుల్ హడావిడి చేస్తున్నాడు. ఓవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక మరోవైపు ఢీ కార్యక్రమాలలో కమీడియన్గా వ్యవహరిస్తూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇటీవల హైపర్ ఆది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో స్టార్ క్యాంపైనర్గా ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also Read: Devi Sri Prasad: త్రివిక్రమ్ వల్లే దేవిశ్రీ ప్రసాద్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోలేకపోయారా.?

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది తన కెరీర్ మరియు జబర్దస్త్ ప్రోగ్రాం, ప్రముఖ స్టార్ యాంకర్ అనసూయ తో ఉన్న రిలేషన్స్ ను ఓపెన్ ద బయట పెట్టేశాడు. ఆది మాట్లాడుతూ..” జబర్దస్త్ కి రాకముందు నేను జాబ్ చేసేవాడిని. అప్పటికే నా ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది. నాకేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. మొత్తానికి ఉన్న మూడెకరాల పొలం అమ్మేసి అప్పులు తీర్చేశాం.

hyper Aadi interesting comments about Anasuya

ఆ తరువాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యా. ఇక అప్పుడు అనసూయతో నాకు మంచి ర్యాపో ఏర్పడింది. అందుకే ఆమెతో స్క్రిప్ట్ చేసేవాడిని. ఆమె కూడా నేను చేసే ప్రతి స్కిట్ ని ఎంజాయ్ చేసేది. నన్ను బాగా అర్థం చేసుకునేది. కావాల్సిన రియాక్షన్ ఇచ్చేది ” అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Anasuya)

Join WhatsApp