Ileana D'Cruz opens up about partner Michael Dolan

Ileana D’Cruz: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటీమణుల్లో గోవా బ్యూటీ ఇలియానా ఒకటి. అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ కు మకాం మార్చింది. కానీ అక్కడ అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. ప్రస్తుతం ఇలియానా వెండితెర నుంచి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా గ‌డుపుతోంది. తన భర్త మైఖేల్ డోలాన్ మరియు కొడుకుతో అమెరికాలో నివాసం ఉంటుంది. ఇలియానా 2023 ఏప్రిల్ లో తన ప్రెగ్నెన్సీ ని ప్రకటించింది.

Ileana D’Cruz opens up about partner Michael Dolan

అయితే ఆ స‌మ‌యంలో భర్త గురించి మాత్రం చెప్పలేదు. క‌నీసం ఆమెకు పెళ్లైనట్లు ఎటువంటి న్యూస్ బ‌య‌ట‌కు రాలేదు. దీంతో పెళ్లి కాకుండానే తల్లి అయిందని ఆమెపై రకరకాల ప్ర‌చారాలు జ‌రిగాయి. కొందరు దారుణంగా విమ‌ర్శ‌లు కూడా చేశారు. కానీ ఇలియానా మౌనాన్ని వీడ‌లేదు. ఇలియానా 2023 ఆగ‌స్టులో పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. అతడికి కొయా ఫోనిక్స్ డోలాన్ అని నామ‌క‌ర‌ణం చేసింది. బిడ్డ పుట్టిన తర్వాత ఇలియానా తన భర్త మైఖేల్ డోలాన్ ను పరిచయం చేసింది.

అత‌నితో దిగిన కొన్ని ఫోటోల‌ను పంచుకుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా ఫస్ట్ టైమ్ భ‌ర్త‌ మైకల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మైఖేల్ ఒక అద్భుత‌మైన వ్యక్తి. నా ఇష్టాలను ఎప్పుడూ గౌరవిస్తాడు. అత‌నితో బంధాన్ని మాట‌ల్లో వివ‌రించ‌లేను. నా బిడ్డ కోవా ఫీనిక్స్‌ డోలన్‌ రాకతో తమ జీవితాలు ఎంతో అందంగా మారాయి. గత ఏడాది చాలా ఆనందంగా గడిచింది అంటూ ఇలియానా ఇంట‌ర్వ్యూలో తెలిపింది.(Ileana D’Cruz)

Also Read: Keerthy Suresh: మ‌హాన‌టి మూవీకి కీర్తి సురేష్ రాంగ్ ఛాయిస్‌.. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్‌!

అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కూడా తాను వ‌ర్క్ చేయాల‌ని అనుకున్నాన‌ని.. కానీ బ్రేక్ తీసుకోకతప్పలేదని ఇలియానా తెలిపింది. ప్రెగ్నెన్సీ స‌మ‌యంతో తన తల్లి చాలా మద్దతుగా నిలిచారని ఆమె పేర్కొంది. ఇక పెళ్లి ఎప్పుడైందనే ప్రశ్నకు ఇలియానా స‌రైన స‌మాధ‌నం మాత్రం ఇవ్వ‌లేదు. మైఖేల్ తో రిలేషన్ గురించి బహిరంగంగా మాట్లాడాల‌ని లేదు. అలా చెప్పి గతంలో విమర్శలు ఎదుర్కొన్నా. ఇక నా గురించి ఏం మాట్లాడినా తట్టుకుంటాను. కానీ భ‌ర్త‌, కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తట్టుకోలేన‌ని ఇలియానా పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, బాలీవుడ్ లో ఇలియానా గ‌తంలో దో ఔర్‌ దో ప్యార్‌, తేర క్యా హోగా లవ్లీ అనే చిత్రాల్లో న‌టించింది. ఈ రెండు సినిమా విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి.

Join WhatsApp