Interesting Details Of Jai Chiranjeeva Movie Child Artist Shriya Sharma

Shriya Sharma: కె విజయ భాస్కర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన యాక్షన్ కామెడీ చిత్రం జై చిరంజీవ. ఈ సినిమాలో భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. 2005లో విడుదలైన జై చిరంజీవ ఆశించని స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్రంలో చిరంజీవి మేనకోడలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? తన ముద్దు ముద్దు మాటలు మరియు స్వీట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఆ చిన్నారి పేరు శ్రియా శర్మ.

Interesting Details Of Jai Chiranjeeva Movie Child Artist Shriya Sharma

హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ న‌గ‌రంలో శ్రియా శర్మ జన్మించింది. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా.. తల్లి డైటీషియన్‌. జై చిరంజీవ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రియా తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా శ్రియా న‌ట‌న‌కు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. అలా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో శ్రియా బాలనటిగా నటించిన మెప్పించింది.

Interesting Details Of Jai Chiranjeeva Movie Child Artist Shriya Sharma

2011లో వ‌చ్చిన చిల్లర్ పార్టీ మూవీకి గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేష‌న‌ల్ అవార్డును అందుకుంది. అలాగే బుల్లితెర‌పై పలు సీరియల్స్ లో సైతం నటించిన శ్రియా.. 2015లో గాయకుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకతో నిర్మల కాన్వెంట్ చిత్రంలో నటించిగా.. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అప్ప‌టినుంచి వెండితెర‌కు దూరంగా ఉంటూ స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేసిన శ్రియా.. ముంబై విశ్వవిద్యాలయంలో న్యాయస్థాస్త్రం పూర్తిచేసి డిగ్రీ అందుకుంది.(Shriya Sharma)

Also Read: Nithiin: జయం, దిల్ చిత్రాల్లో నితిన్ కు డ‌బ్బింగ్ చెప్పిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

26 ఏళ్ల శ్రియ ఇప్పుడు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు అడ్వకేట్ గా వ్యవహరిస్తోంది. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోయినా లాయర్ గా దూసుకుపోతోంది. ఇకపోతే లుక్స్ పరంగా శ్రీయ చాలా మారిపోయింది. ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గకపోయినా.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు శ్రియ లావుగా తయారైంది. దీంతో శ్రియా తాజా ఫోటోలు చూసి నెటిజ‌న్లు అవాక్కైపోతున్నారు. ఈమె జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే న‌మ్మ‌లేక‌పోతున్నారు.

Join WhatsApp