Interesting facts on actress Alia Bhatt

Alia Bhatt: అలియా భ‌ట్ అంటే తెలియ‌ని ఇండియ‌న్ సినీ ప్రియులు ఉండ‌రు. నెపో కిడ్‌ అని ఎంత మంది విమ‌ర్శించినా.. త‌న ఫోక‌స్ దారి తప్ప‌నివ్వ‌లేదు. గ్లామర్​ పాత్రలే కాకుండా లేడీ ఓరియేంటెడ్ పాత్రలు చేస్తూ గొప్ప న‌టిగా పేరు తెచ్చుకుంది. జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. త‌న ప‌నిత‌నంతోనే ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రి నోర్లు మూయిస్తుస్తున్న అలియా భ‌ట్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Interesting facts on actress Alia Bhatt

1993 మార్చి 15న ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌ మహేష్ భట్ మరియు బ్రిటిష్ నటి సోనీ రజ్దాన్ దంపతులకు అలియా భట్ జన్మించింది. అలియా భ‌ట్‌కు షాహీన్, పూజ మరియు రాహుల్ భట్ అనే తోబుట్టువులు ఉన్నారు. సినిమా వాతావ‌ర‌ణంలో పెర‌గ‌డం వ‌ల్ల చిన్న‌త‌నం నుంచి అలియా భ‌ట్ న‌టి కావాల‌ని ఆశ‌ప‌డింది. చ‌దువుల్లో ఎప్పుడూ కాస్త వెన‌కే ఉండేది. ముంబైలో అలియా త‌న స్కూలింగ్ ను పూర్తి చేసింది. రోజూ స్కూల్ లో వాష్ రూమ్‌లోకి వెళ్లి అలియా భ‌ట్ నిద్ర‌పోయేద‌ట‌. అయితే ఓ రోజు టీచ‌ర్ ఆమెను గ‌మ‌నించి.. వారం పాటు క్లాస్ రూమ్స్‌లోని బెంచీల‌ను తుడ‌వ‌మ‌ని ప‌నిష్మెంట్ ఇచ్చార‌ట‌. అలా స్కూల్ లో బెంచీలు తుడిచిన స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అలియా భ‌ట్‌.

తల్లిదండ్రులు సినీ పరిశ్రమకు చెందిన వారే అయినా.. వారి పేరు వాడుకోకుండా స్వతహాగా ఇండస్ట్రీలో రాణించాలని అలియా భ‌ట్‌ ఆశపడింది. ఆ కారణంతోనే టీనేజ్ నుంచే సినిమాల్లో ఛాన్సులు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. క‌ర‌ణ్ జోహార్ యొక్క‌ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ మూవీ ఆడీష‌న్స్ లో 500 మంది అమ్మాయిలో పోటీ ప‌డి మ‌రీ ఛాన్స్ ద‌క్కించుకుంది.

Interesting facts on actress Alia Bhatt

2012లో విడుద‌లైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ మంచి విజ‌యాన్ని అందుకుంది. తొలి ప్ర‌య‌త్నంలోనే న‌టిగా అలియా స‌క్సెస్ అయింది. అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అలియా భట్ ఫస్ట్ మూవీ కాదు. ఆరు సంవత్సరాల వయస్సులోనే ఆమె చలనచిత్ర ప్రపంచంలోకి ప్రవేశించింది. 1999లో విడుద‌లైన సంఘర్ష్‌లో యువ ప్రీతి జింటా పాత్రను పోషించింది. ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ త‌ర్వాత అలియా హీరోయిన్ గా ఫుల్ అయింది. హైవే, 2 స్టేట్స్, అగ్లీ, షాందర్ తో స‌హా ఎన్నో చిత్రాల్లో న‌టించింది.(Alia Bhatt)

Also Read: Niharika Konidela: పిల్ల‌లంటే చాలా ఇష్టం.. ఈసారి ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటానంటూ నిహారిక ఓపెన్ కామెంట్స్‌!

క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ తో పాటు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ న‌టిగా త‌న‌ను తాను నిరూపించుకుంది. గంగూబాయి కతియావాడి మూవీతో అలియా ఇమేజ్ డ‌బుల్ అయింది. ఆర్ఆర్ఆర్ లో సీతగా న‌టించి సౌత్ సినీ ప్రియుల‌కు చేరువైంది. న‌టిగానే కాకుండా నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా స‌త్తా చాటోంది. కెరీర్ ప‌రంగా పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న స‌మ‌యంలోనే ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్ తో పెళ్లి పీట‌లెక్కింది. వివాహ‌మైన కొద్ది నెల‌ల‌కు పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది.

Join WhatsApp