interesting news about Allu Arjun

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఇదే సినిమాతో తన యాక్టింగ్ను నిరూపించుకుని నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రూల్ మూవీలో నటిస్తున్నాడు. ఇక ఇటీవల ఈ మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో హోరెక్కిస్తుంది. ఇదే క్రమంలో బన్నీ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

interesting news about Allu Arjun

బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి చెందినది కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ అప్డేట్స్ను షేర్ చేసుకుంటూ ట్రెండ్ అవుతుంది ఈ బ్యూటీ. ఇక మొదట్లో అల్లు అర్జున్ ని చూసి వీడు హీరో ఏంట్రా? అని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. కానీ అవేవీ బన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగాడు. గంగోత్రి బంటి సినిమాల టైంలో అయితే బన్నీ ఫేస్ లుక్ ని చూసి ట్రాన్స్లేటర్ అని కూడా అన్నారు. ఇక వాటిని చాలెంజింగ్ కింత తీసుకుని అనంతరం అనేక సినిమాలు చేశాడు బన్నీ. కానీ కొంతకాలం పాటు అల్లు అర్జున్ కి సరైన సక్సెస్ మాత్రం పడలేదు. దీంతో బన్నీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడట.

Also Read: Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే సూచనలు ఇవే..!

ఓ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ సమయంలో బన్నీ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి ఇంకా ఇండస్ట్రీ వైపే చూడకూడదు అని ఫిక్స్ అయిపోయాడట. కానీ ఆ టైంలో బన్నీని ఓ వ్యక్తి ఆపి ప్రస్తుతం ఈ స్థాయికి తీసుకొచ్చారు. మరి ఆ వ్యక్తి మరెవరో కాదు బన్నీ భార్య స్నేహ రెడ్డి. ఆ సమయంలో స్నేహారెడ్డి అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలిచింది. బన్నీ ఎప్పుడు డిప్రెషన్ లేదా లోన్లీ లో ఉన్న స్నేహారెడ్డి తనకి సపోర్ట్ గా నిలుస్తూ ఉంటుందట. ” సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి కామన్.. నాకంటే నీకే బాగా తెలుసు కూడా. చిన్న చిన్న విషయాలకి ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు.

interesting news about Allu Arjun

నెక్స్ట్ టైం ఇంతకు మించిన హిట్ కొడతావు. నువ్వు సినిమాలు చెయ్ ఫ్లాప్ అండ్ సక్సెస్ ని పక్కన పెట్టి నువ్వు చేసే రోల్స్ గురించి ఆలోచించు. నీ క్యారెక్టర్స్ లో ప్రాధాన్యత ఉంటే ప్రేక్షకులే ఆటోమేటిక్గా నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు గెలిచిన ఓడిపోయిన నీ వెంట నేను ఉంటా ” అంటూ ధైర్యం చెప్పిందట స్నేహ రెడ్డి. అలా బన్నీ నిర్ణయాన్ని తప్పు అని ప్రూవ్ చేసింది స్నేహ. ప్రెసెంట్ బన్నీ ఫాలోయింగ్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు స్నేహారెడ్డి అటువంటి మాటలు చెప్పకపోతే ఈరోజు బన్నీకి నేషనల్ అవార్డు దక్కేది కాదనే చెప్పుకోవచ్చు. ఏదేమైనాప్పటికీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇటువంటి బాండింగ్ ఉంటే ఆ జంట ఎప్పుడు స్ట్రాంగ్ గా నిలబడుతుందని మరోసారి ప్రూవ్ చేశారు ఈ క్యూట్ కపుల్.(Allu Arjun)

Join WhatsApp