interesting news about Namrata Shirodkar

Namrata Shirodkar: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో మహేష్ మరియు నమ్రత కూడా ఒకరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె తన కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో మహేష్ ని వివాహమాడి సినీ కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పింది. ఇక ప్రస్తుతం వీరికి గౌతమ్ అండ్ సితార అనే ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు.

interesting news about Namrata Shirodkar

సూపర్ స్టార్ కృష్ణ.. ఇందిరా దేవి కుమారుడైన మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా అడుగుపెట్టాడు. అయితే 2022 లోనే మహేష్ బాబు మదర్ కన్నుమూశారు. అయితే తాజాగా నమ్రత తన అత్తను తల్చుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. ” మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది. దానికి ఇందిరా దేవి ఫోటోని కూడా టాక్ చేసింది. కాగా ఇందిరా దేవి 20 ఏప్రిల్ 1952లో జన్మించారు.

Also Read: Sreeleela: రాజకీయ నాయకుడి మనవడితో శ్రీలీల డేటిం**.. త్వరలోనే పెళ్లి..?

హీరో కృష్ణ ను పెళ్లాడిన ఇందిరా దేవికి ఇద్దరు కుమారులు.. ముగ్గురు కుమార్తెలు జన్మించారు. ఇక ఒకే ఏడాదిలో కృష్ణ, ఇందిరా దేవి మరణించడం టాలీవుడ్ పరిశ్రమలో విషాదంగా మారింది. ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

interesting news about Namrata Shirodkar

ఇక ఈ సినిమాని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాపై భారీ హైప్స్ కూడా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ యొక్క పూర్తి పనులను పూర్తి చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. దిగ్గజ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అది పక్క సూపర్ హిట్ అనే చెప్పుకోవచ్చు. తన కెరీర్లో ఇప్పటివరకు అపజయాన్ని చూడని ఏకైక డైరెక్టర్గా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు రాజమౌళి. మరి మహేష్ తో చేస్తున్న ఈ సినిమాని ఏ విధంగా చిత్రీకరిస్తాడో చూడాలి.(Namrata Shirodkar)

Join WhatsApp