interesting news about Pooja Hegde

Pooja Hegde: ఐరన్ లెగ్ గా పేరు వేసుకున్న పూజా హెడే కి ప్రస్తుత కాలంలో ఎటువంటి అవకాశాలు దక్కడం లేదు. పోనీలే ఇటీవలే గుంటూరు కారం సినిమాలో అవకాశం దక్కింది అనుకునే లోపే ఆ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. ఒకంత చెప్పుకోవాలంటే గుంటూరు కారం నుంచి సైడ్ అవ్వడం మంచిపనే. ఎందుకంటే సినిమా అంత దారుణంగా ఉంది కనుక. మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

interesting news about Pooja Hegde

అసలే వర‌స‌ ఫ్లాప్స్ తో ఉన్న పూజా హెడే కనుక ఈ సినిమాలో నటించి ఉంటే ఇంకా తట్ట, బుట్ట సదురుకోవాల్సిందే అని చెప్పొచ్చు. అలా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా నుంచి తప్పుకుని మంచి పని చేసింది. ఇక పూజ హెడే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఈమెకి ఎవరు పెద్దగా సినిమా అవకాశాలు ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీకి దూరమై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Also Read: Naga Chaitanya: తనకి సాయి పల్లవి పై ఉన్న ఇష్టాన్ని సమంతాతో షేర్ చేసుకున్న చైతు.. వీడియో వైరల్..!

పూజా హెగ్డే సరసన ఏ హీరో అయితే బాగా సెట్ అవుతాడు. అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బన్నీ అని చెప్పొచ్చు. వీరి కాంబినేషన్ కి ఆ రేంజ్ పాపులారిటీ ఉంది మరి. పూజ ఇతర హీరోలతో నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ బన్నీతో నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు ఫ్లాప్ అవ్వలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ కి క్రేజీ బజ్ ఏర్పడింది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెడేకి మరోసారి అవకాశం ఇచ్చాడట బన్నీ.

interesting news about Pooja Hegde

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హిట్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ఇప్పటికే బన్నీ సైతం ఓకే చెప్పాడు. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెడేని కన్ఫామ్ చేశారట మేకర్స్. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ బన్నీతో కలిసి డీజే, అలా వైకుంటపురం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును పొందుతుంది. ఇక ముచ్చటిగా వీరిద్దరి జంట మూడోసారి తెరపైన కనిపించనుంది. ఇక త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది మూవీ టీం.(Pooja Hegde)

Join WhatsApp