interesting news about Prabhas

Prabhas: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్షించిన ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి విజయం సాధించాడు. ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ బాహుబలి సినిమా తోనే పాన్ ఇండియా హీరో అయ్యాడు.

interesting news about Prabhas

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో ప్రభాస్ మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు మరి ప్రభాస్. నిజానికి ప్రభాస్కి నటన అంటే అసలు ఇష్టం ఉండదట. కానీ ప్రస్తుత కాలంలో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. అది ఎలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Health: పొట్ట కొవ్వును కరిగించి.. మిమ్మల్ని స్లిమ్ గా చేసే పండ్లు ఇవే..!

ప్రభాస్ ని తన నాన్న చనిపోయిన నాటి నుంచి కృష్ణంరాజు నే చూసుకునేవాడు. ఇక అనంతరం ప్రభాస్ ఒక్కసారి కూడా సినిమాల్లోకి వెళ్లాలని అస్సలు ఆలోచించలేదు. ప్రభాస్ బాగా చదువుకోకపోయినా ఏదో చిన్న రెస్టారెంట్ పెట్టుకుని లైఫ్ని లీడ్ చేద్దాంలే అని మైండ్ సెట్ లో ఉండేవాడట. కానీ అనంతరం కృష్ణంరాజు.. ప్రభాస్ ని సినిమాల్లోకి వెళ్ళమనడంతో ఇష్టం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్.

interesting news about Prabhas

ఇక ప్రభాస్ ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయినా బ్లడ్ డొనేట్ చేస్తాడు. అంతేకాకుండా ప్రభాస్ కి ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ అనాధ పిల్లల దగ్గరికి వెళ్లి వారికి ఏం కావాలో అవి కొనిస్తూ ఉంటాడు. అలా ప్రభాస్ కి సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా కృష్ణంరాజు కారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఈ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రభాస్ కి కనుక అప్పుడు ఇష్టం లేదని చెప్పి ఏ చిన్న హోటల్లోనూ ఉంటూ ఉంటే ఇప్పుడు ఇంత పాపులారిటీ దక్కేది కాదని చెప్పుకోవచ్చు.(Prabhas)

Join WhatsApp