interesting news about Shakeela marriage

Shakeela: తమ బోల్డ్ నెస్ ని చాలా స్పష్టంగా చూపిస్తూ ఫేమస్ అయిన వారిలో షకీలా కూడా ఒకరు. ఒకానొక సమయంలో షకీలా అంటేనే ఒక పెద్ద బూతు పదం లాగా చూసేవారు. ప్రతి సినిమాలోను కూడా ఈ ముద్దుగుమ్మ ఉండేది. అంతటి క్రేజ్ ని సంపాదించుకుంది మరి. తన బోల్డ్ నెస్ తో ఎంతోమందిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో ఎటువంటి సినిమాలలో నటించడం లేదు. ఇక‌ వయసు మీద పడినప్పటికీ ఇప్పటివరకు షకీలా పెళ్లి అని పదానికి నోచుకోలేదు. ఈమె పెళ్లి పై గతంలో అనేక వార్తలు షికారు చేశాయి.

interesting news about Shakeela marriage

కానీ వీటిపై ఈమె ఏమాత్రం స్పందించకపోవడంతో అవి కాస్త డీలపడ్డాయి. నిజానికి షకీలా పెళ్లి చేసుకోకపోవడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ హౌస్లో పాల్గొని మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉల్టా పుల్టా సీజన్లో ఈమె ఉన్నది తక్కువ రోజులు అయినప్పటికీ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తాను బిగ్ బాస్ లోకి షకీలా గా వెళ్ళలేదని షకీలా అమ్మగా వెళ్లానని కూడా వెల్లడించి ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన షకీలా పెద్దగా ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. తాజాగా బిగ్ బాస్ వారు అరేంజ్ చేసుకున్న షోలో దర్శనమిచ్చింది.

Also Read: Naga Chaitanya: ఎన్ని కోట్లిచ్చినా నాగచైతన్యతో నటించనని మొహం మీదే చెప్పిన స్టార్ హీరో డాటర్.. ఎవరంటే..?

అదేవిధంగా టేస్టీ తేజ youtube ఛానల్ కి ఓ ఇంటర్వ్యూ సైతం ఇచ్చింది. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమెని హోస్ట్ చేసిన తేజ మీరు పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించగా.. దానికి షకీలా సమాధానం ఇస్తూ..” అన్ని నా ఫ్యామిలీ కోసమే. ఇప్పుడు నా ఫ్యామిలీలో అందరూ చనిపోయారు. ఒక తమ్ముడు సపరేట్గా ఉన్నారు ఒక అక్క మాట్లాడడం లేదు. ప్రస్తుతానికి అయితే నాకంటూ ఏ ఫ్యామిలీ లేదు. నేను ఒక అతన్ని లవ్ చేశా వాళ్లు నన్ను మాత్రమే కావాలనుకున్నారు. మా అమ్మని ఓల్డేజ్ హౌస్ లో వేద్దామని అన్నారు. నాకేంటంటే నేను సంపాదించి వండిపెట్టి మా అమ్మని మాత్రం ఓల్డ్ ఏజ్ హౌస్ లో వేయాలా అని థాట్ ఉండేది.

interesting news about Shakeela marriage

అలా అలా ఆ బంధం పోయింది ఆ తరువాత మా అమ్మ పోయింది. మా అమ్మ నాకు 34 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. ఆ తరువాత పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ తర్వాత అన్న అడ్డొచ్చాడు. అన్న ఫ్యామిలీ ని పోషించాల్సిన స్థితి పట్టింది. మా అన్న చనిపోయాడు. వారి పిల్లల్ని నేనే చూసుకునే దాన్ని. నాకు వచ్చిన సంబంధాలు ఆ పిల్లలు ఇక్కడ ఉండకూడదు అని అనేవారు. అందుకే ఆ పిల్లల గురించి నేను అప్పుడు కూడా ఆగిపోయా ” అంటూ చెప్పుకొచ్చింది షకీలా. ప్రస్తుతం షకీలా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా…” మీరు క్యారెక్టర్ పరంగా ఎంత బోల్డ్ గా ఉన్న రియల్ లైఫ్ లో చాలా మంచివారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. జీవితం అందరికీ హ్యాపీగా ఉండదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Shakeela)

Join WhatsApp