interesting news about Singer Sunitha

Singer Sunitha: ప్రముఖ సింగర్ సునీత గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె త్వరలోనే తల్లి కాబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈమెపై ఇటువంటి పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఈమె ప్రెగ్నెంట్ అని వార్తలు పుట్టించారు. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చింది సింగర్ సునీత. ఇక తాజాగా ఈ వార్త మరింత రెచ్చిపోయింది.

interesting news about Singer Sunitha

గతంలో ఈ విధంగానే ఈ వార్తలు వైరల్ అయితే.. నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.. అని తనపై వచ్చిన వార్తలను గట్టిగా ఖండించింది. ఈమె గతంలో హైదరాబాద్ వేదికగా మ్యాస్ర్టో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

Also Read: Health: ఉచితంగా దొరికే ఈ ఆకు తిని మీ సమస్యలన్నిటికీ చెక్ పెట్టండి..!

ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రేగ్నెంట్ వార్తలపై స్పందించింది. అంతేకాకుండా ఈ కాన్సర్ట్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే ఈ వార్తలకి అడ్డుకట్ట పడింది అనుకునే లోపే మరోసారి ఈ వార్తలు చెలరేగాయి. 43 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ ట్రోలర్స్ దారుణంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

interesting news about Singer Sunitha

ఇప్పటికే తాను ప్రెగ్నెంట్ కాదని పలుమార్లు చెబుతూ ఖండించినప్పటికీ ఈ వార్తలు కి మాత్రం అడ్డు కట్ట పడడం లేదు. ఈ వార్తలను ఖండించేందుకు సింగర్స్ సునీత సర్వవిధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఇక ఇప్పుడు ఈమెపై జరిగే ట్రోల్స్ గురించి ఈమె ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. నిజానికి సింగర్ సునీత వీటిపై కొంచెం గట్టిగా స్పందిస్తేనే కానీ ఈ వార్తలు ఆగవు.(Singer Sunitha)

Join WhatsApp