interesting news about Venkatesh movie child artist

Venkatesh: ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారంతా ఇప్పుడు స్టార్ హీరో మరియు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చి అనేకమంది ఫేమస్ అవుతున్నారు కూడా. ప్రస్తుతం ఇదే ట్రెండ్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తున్నాడా?.

interesting news about Venkatesh movie child artist

ప్రస్తుతం ఆ బుడ్డోడు గురించి సోషల్ మీడియాలో నెట్టింట రచ్చగా మారింది.‌ వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాలో మరో యాక్టర్ కూడా తన నటనతో మెప్పించిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. ఇక ఈ మూవీలో నటించిన యాక్ట్రెస్ కూడా తమతో ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు.

Also Read: Anupama: అనుపమ లో ఆ క్వాలిటీ చూసి థియేటర్ కి ఏంటి స్మశానానికి కూడా వచ్చేస్తారు.. సిద్దు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఈ సినిమాతోనే వెంకటేష్ కి ఫ్యామిలీ స్టార్ పేరు దక్కింది. గతంలో అనేక సినిమాల్లో నటించినప్పటికీ వెంకటేష్ కి పెద్దగా పాపులారిటీ దక్కలేదు. కానీ ఈ ఒక్క సినిమాతో ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు కొట్టేశాడు. ఇక ఈ మూవీలో తలలో మల్లె పువ్వులు అనే డైలాగ్ తో ఫుల్ ఫేమస్ అయిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ నాగ్ అన్వేష్. ఈ సినిమాలో ఈ బుడ్డోడుతో ఉండే కామెడీ సీన్స్ సినిమాకు హైలెట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు.

interesting news about Venkatesh movie child artist

నాగ్ అన్వేష్ తండ్రి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడే కావడంతో అతనికి సినిమాలలో ఎక్కువగా ఛాన్సులు వచ్చాయి. ఇక నాగ్ అన్వేష్.. వినవయ్య రామయ్య అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అనంతరం హెబ్బా పటేల్ తో కలిసి ఏంజెల్ మూవీ చేశాడు. ఇక నాగ్ అన్వేష్ తన స్నేహితురాలైన కావ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ హీరోగా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయాడు. దీంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.(Venkatesh)

Join WhatsApp