Is that director the cause of Sruthi Haasan breakup

Sruthi Haasan: హీరోయిన్ శృతిహాసన్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హాజరికతో విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చాలామంది నటీ నటులు విడిపోయినా, బ్రేకప్ చెప్పుకున్నా అస్సలు స్పందించరు. ఆ తర్వాత కొద్ది రోజులకు నిజంగానే మేము విడిపోయాం అని క్లారిటీ ఇస్తారు.ఇక ఇంకొంత మందేమో ఇలాంటి డివోర్స్ వార్తలు లేదా బ్రేకప్ వార్తలు వారి మీద చక్కర్లు కొడితే అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇస్తూ ఉంటారు.

Is that director the cause of Sruthi Haasan breakup

అయితే తాజాగా శృతిహాసన్ బ్రేకప్ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో శృతిహాసన్ గానీ,శాంతాను గానీ క్లారిటీ ఇవ్వకపోవడంతో నిజంగానే వీళ్ళిద్దరూ విడిపోయారని అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్లు ఇది నిజమే అయింది ఎందుకంటే రీసెంట్ గా బాంబే టైమ్స్ కీ ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతాను కి శృతిహాసన్ గురించి ప్రశ్న ఎదురవగా సారీ నేను ఈ విషయంపై ఏమి చెప్పదలుచుకోలేను.. అని తప్పించుకున్నారు. అయితే ఈయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వీరిద్దరూ ఫ్రెండ్లీ గానే బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది.( Sruthi Haasan)

Also Read: Sri Reddy: శ్రీ రెడ్డి ని నగ్న**గా ఫిల్మ్ చాంబర్ ముందు కూర్చోమని చెప్పింది ఆయనేనా.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

ఇక శృతిహాసన్ రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతాలో బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసింది. అలాగే ఇది ఓ క్రేజీ రైడ్.. ఈ క్రేజీ రైడ్ లో నా గురించి కాకుండా ఇతర వ్యక్తుల గురించి కూడా ఎంతగానో నేర్చుకున్నాను అని పోస్ట్ పెట్టింది. దీంతో వీరిద్దరి బ్రేకప్ వార్తలు నిజమే అని అందరూ భావిస్తున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఆ డైరెక్టర్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.ఇక ఆ డైరెక్టర్ ఎవరంటే కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

Is that director the cause of Sruthi Haasan breakup

శృతిహాసన్ లోకేష్ రీసెంట్గా ఇనిమేల్ అనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో నటించారు.ఇక దీనికి కమలహాసన్ ప్రొడ్యూసర్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఇనిమేల్ ఆల్బమ్ సాంగ్లో లోకేష్ కనగరాజ్ శృతిహాసన్ కెమిస్ట్రీ చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. అయితే ఈ ఆల్బమ్ సాంగ్ లో నటించాకే శాంతాను, శృతి మధ్య గొడవలు జరిగి దూరం పెరిగిందని,ఇందువల్లే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని,అలా పరోక్షంగా లోకేష్ కనగరాజ్ శృతిహాసన్ బ్రేకప్ కి కారణమయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.( Sruthi Haasan)

Join WhatsApp