Is this the reason why Comedian Sunil's career is gone?

Comedian Sunil: స్టార్ కమెడియన్స్ లో ఒకరైన సునీల్ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. మొదటిగా తన కెరీర్ ను కమీడియన్ గా ప్రారంభించి అనంతరం హీరో, విలన్, ఇతర క్యారెక్టర్స్ లో కూడా నటించాడు సునీల్. ప్రస్తుతం సునీల్ తన జోరును తగ్గించాడు. పుష్ప సినిమాలో కనిపించి ఫామ్ లోకి వచ్చిన సునీల్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తోనే అల్లు అర్జున్కి స్టార్ స్టేటస్ కూడా దక్కింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు అల్లు అర్జున్.

Is this the reason why Comedian Sunil’s career is gone?

ఇక ఇదిలా ఉంటే తాజాగా సునీల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సునీల్ కి పెద్దగా అవకాశాలు రాకపోవడానికి ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటి? కారణమేంటి? అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. కమెడియన్గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈయనకి కమెడియన్ గానే మంచి గుర్తింపు దక్కింది. కామెడీ ఇజాన్ని వద్దనుకుని హీరోగా ఎదుగుదామని ట్రై చేశాడు సునీల్.

Also Read: Allari Naresh: అల్లరి నరేష్ కెరీర్ లో తన ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసా..!

కానీ అది కాస్త తన కెరీర్ కి డ్యామేజ్ గా నిలిచింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో హీరోగా సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో ఈయనకి కమెడియన్ అవకాశాలు తగ్గాయి. ఇక హీరోగా ఆయన ఎదుగుతాడు అనుకుంటే.. అందులో కూడా బోల్తాపడ్డాడు. దీంతో అటు కమెడియన్ అవకాశాలు పోయి హీరోగా కూడా అవకాశాలు రాకపోవడంతో తన కెరీర్ ని చేతులారా పాడు చేసుకున్నట్లు అయింది. అలా తన సినీ కెరీర్ ను తన చేతులారా తానే నాశనం చేసుకున్నాడు సునీల్.

Is this the reason why Comedian Sunil's career is gone?

మొదటినుంచి హీరోగా అయినా లేదా కమీడియన్ గా అయిన ఒక రంగంలోనే కొనసాగితే ఆయనకి ప్రస్తుత కాలంలో మంచి గుర్తింపు దక్షుదని చెప్పుకోవచ్చు. కానీ మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచి అనంతరం హీరో అవ్వడంతో ఆయనని అందరూ కమెడియన్ గానే చూశారు. హీరోగా ఆయన గెటప్ వేసినప్పటికీ ఆయనని హీరోగా ఎవరు భావించలేదు. దీంతో ఆయన హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. అలా ఖరీదు మంచి పిక్స్ లో ఉన్న సమయంలో రాంగ్ డెసిషన్ తీసుకుని పప్పులో కాలేశాడు సునీల్.(Comedian Sunil)

Join WhatsApp