Janhvi Kapoor in that star hero movie

Janhvi Kapoor: ఇండియన్ సినీ హిస్టరీలో తన అందం అభినయంతో దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివంగత నటి శ్రీదేవి… ఇక ఈ హీరోయిన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది.ఆమె సినిమాల్లో ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు.. ఇక శ్రీదేవి మరణం ఎంతో మంది అభిమానులను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది.ఇప్పటికి ఆమె సినిమాలు చూస్తే చాలామంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఐదు పదుల వయసు దాటినా కూడా యంగ్ హీరోయిన్లా తన అందంతో అందరిని ఆశ్చర్యపరిచింది.

Janhvi Kapoor in that star hero movie

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కూతురు జాన్వీ కపూర్ కూడా ప్రస్తుతం తల్లి లాగే సౌత్,నార్త్ ఇండస్ట్రీలలో పాగా వేయాలని చూస్తోంది.ఇక బాలీవుడ్ లో ధడక్ అనే మూవీతో ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉంది.తల్లిలాగే తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాలి అనుకుంది.అలా దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అంతేకాకుండా రాంచరణ్ హీరోగా చేస్తున్న ఆర్ సి 16 మూవీలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయింది.(Janhvi Kapoor)

Also Read: Thalaivar171: రజినీకాంత్ కొత్త టీజర్.. ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్!!

అయితే ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం కొట్టేసిన జాన్వీ కపూర్ ముచ్చటగా మూడో సినిమాలో కూడా అవకాశం పట్టేసిందట. ఇక అది కూడా మరో స్టార్ హీరో సినిమాలో.. ఇక టాలీవుడ్ లో వినిపిస్తున్న క్రేజీ టాక్ ఏంటంటే.. జాన్వీ కపూర్ మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా అవకాశం కొట్టేసిందట..

Janhvi Kapoor in that star hero movie

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే ఇది ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం అని హను రాఘవపూడి కూడా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ ని తీసుకున్నట్టు నెట్టింట్లో ఓ టాక్ చక్కర్లు కొడుతుంది.ఒకవేళ ఇదే నిజమైతే ముగ్గురు స్టార్ హీరోలతో ఈ హీరోయిన్ నటించిన ఏ ఒక్క సినిమా హిట్ అయిన సరే తెలుగులో ఈమెకు తిరుగుండదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు

Join WhatsApp