Janhvi Kapoor who knocked out the hero's teeth

Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాదు దక్షిణాదిలో కూడా తన హవా కొనసాగించాలి అనే ఉద్దేశంతో దేవర మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయి ఆ మూవీ షూటింగ్లో కూడా పాల్గొంది. ఇక దేవర మూవీ మాత్రమే కాదు రాంచరణ్ హీరోగా చేస్తున్న బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే నెక్స్ట్ మూవీ లో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

Janhvi Kapoor who knocked out the hero’s teeth

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ చేయబోయే ఓ మూవీలో కూడా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే జాన్వి కపూర్ ఒక హీరోని పళ్ళు రాలిపోయేలా కొట్టిందట. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు జాన్వి కపూర్ చేత పళ్ళు రాలగొట్టించుకున్నాడు.. అసలు అంత పెద్ద తప్పు ఆయన ఏం చేశాడు అనే సంగతి ఇప్పుడు చూద్దాం. జాన్వీ కపూర్ ఆ హీరో పళ్ళు రాలగొట్టింది అనేది నిజమే అనుకుంటే మీరందరూ పప్పులో కాలేసినట్టే. (Janhvi Kapoor)

Also Read: Naga Shaurya: ‘ఛలో’ మూవీ హిట్ అయినా మేం నష్టాలపాలయ్యాం.. నాగశౌర్య తల్లి కామెంట్స్ వైరల్.!

ఎందుకంటే జాన్వీ కపూర్ ఆ హీరో పళ్ళు నిజంగా రాలగొట్టలేదు. ఇక అసలు విషయం ఏమిటంటే.. జాన్వీ కపూర్ హిందీలో మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే మూవీలో నటిస్తోంది.ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా చేస్తున్నారు. ఇక క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కి శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ఈనెల అంటే మే 31న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలెట్టేసారు చిత్ర యూనిట్.

Janhvi Kapoor who knocked out the hero's teeth

అయితే ఈ సినిమా క్రికెట్ కి సంబంధించి ఉంటుంది కాబట్టి తాజాగా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ జాన్వీ కపూర్ హీరో రాజకుమార్ రావు ఇద్దరు కలిసి క్రికెట్ ఆడారు. ఇందులో జాన్వి బ్యాటింగ్ చేయగా రాజ్ కుమార్ బౌలింగ్ చేశారు. ఇక రాజ్ కుమార్ బౌలింగ్ వేయగానే జాన్వి కొట్టిన షాట్ కి రాజ్ కుమార్ తన పళ్ళు రాలిపోయినట్టుగా ఫన్నీ గా నటించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ హీరోయిన్ కొట్టిన షాట్ కి హీరో పళ్ళు రాలిపోయాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Janhvi Kapoor)

Join WhatsApp