Jayamalini Talking About Silk Smitha Death

Silk Smitha: ఎన్ని తరాలు మారిన మ‌ర్చిపోలేని అతికొద్ది మంది తార‌ల్లో సిల్క్ స్మిత ఒక‌రు. మత్తెక్కించే కళ్లు, తేనెలూరే పెదవులు మ‌రియు అంద‌చందాల‌తో సినిమా ప‌రిశ్ర‌మ‌ను సిల్క్ స్మిత ఒక ఊపు ఊపేసింది. 80, 90 ద‌శ‌కాల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 400 పైగా చిత్రాల్లో న‌టించింది. బోల్డ్ కారెక్ట‌ర్స్ మ‌రియు ఐటెమ్ సాంగ్స్ కు కేరాఫ్ గా నిలిచింది. అగ్ర‌తార‌ల‌ను త‌ల‌ద‌న్నే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. సిల్క్ స్మిత ఇమేజ్ వ‌ల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి.

Jayamalini Talking About Silk Smitha Death

అలాంటి ఆమె 35 ఏళ్ల‌కే ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోవ‌డం ఇండ‌స్ట్రీకి ఒక శాపం. చిన్న వయసులోనే పెళ్లి.. అత్తారింట్లో వేధింపులు, ఆ త‌ర్వాత ఇంట్లో నుంచి పారిపోయి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సిల్క్ స్మిత‌.. మేకప్ ఆర్టిస్ట్ నుంచి న‌టిగా ఎదిగింది. ఎవ‌రి ఊహ‌ల‌కు అంద‌ని రీతిలో పేరు, డబ్బు, హోదా సంపాదించుకుంది. కానీ ఎందుకు చిన్న వ‌య‌సులోనే సూసైడ్ చేసుకుంది అన్న‌ది మాత్రం ఇప్ప‌టికీ ఒక వీడ‌ని మిస్ట‌రీనే.

అయితే తాజాగా సిల్క్ స్మిత మ‌ర‌ణంపై ప్ర‌ముఖ న‌టి జ‌య‌మాలిని సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ప్పుడు ఐటెం సాంగ్స్ తో తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసిన జ‌య‌మాలిని ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బు సంపాదించుకున్న నటి సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరం. జీవితంలో సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండడం.(Silk Smitha)

Also Read: Surbhi: చావు అంచుల వ‌ర‌కు వెళ్లొచ్చిన సురభి.. ఫుల్‌గా భ‌య‌ప‌డిపోయిన హీరోయిన్‌.. ఏం జ‌రిగిందంటే?

ఎందుకంటే సొంతవాళ్లు లేకపోతే చాలామంది మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సిల్క్ స్మిత కూడా అలానే బ‌లైపోయింది. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. ప్రేమించడం తప్పు కాదు. కానీ సిల్క్ స్మిత అతన్ని గుడ్డిగా నమ్మేసింది. అతడు మోసం చేశాడు. ఒకవేళ త‌ల్లిదండ్రులు పక్కన ఉండి ఉంటే బాధ‌లో ఆమెకు అండగా నిలిచేవారు అంటూ జయమాలిని చెప్పుకొచ్చారు. దీంతో ఆమె కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.

Join WhatsApp