Johnny Master, who was angry with Venkatesh's child artist,

Venkatesh: తెలుగు బెస్ట్ డాన్సింగ్ షో గా నిలిచిన ఢీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమ ప్రతిభ ని చూపించుకునే అవకాశాన్ని పొందారు. స్టార్స్ గా కూడా ఎదిగారు. డాన్సింగ్ విభాగం లో ఈ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఢీ షోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒక జడ్జ్ కోపంతో ఊగిపోవడం.. డాన్సర్ చేసిన పనికి ఆయన కోపంతో మైక్ పగలగొట్టడం జరిగింది.

Johnny Master, who was angry with Venkatesh’s child artist,

అంతేకాకుండా షో నుంచి వెళ్లిపోవడం కూడా అయ్యింది. జనరల్ గా జబర్దస్త్ షోస్ లో ఇలాంటివి చాలా కామన్. కానీ ఢీ షోలో మాత్రం చాలా అరుదు మరియు రేర్ గా ఉంటాయి. ఈ షో లో ఎక్కువ శాతం నవ్వించడానికి ప్రయత్నిస్తారు కానీ ఇటువంటి ఇన్సిడెంట్ క్రియేట్ చేయరు. హైపర్ ఆది లాంటి వాళ్లు చేసే కామెడీ ఈ షోలో హైలెట్గా నిలుస్తుంది. కానీ ఒక జడ్జ్ ఇలా రియాక్ట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంతకీ డి షోలో ఏమైందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Rana: రానాతో త్రిష ఎఫై**.. ఇంట్లో రహస్యంగా ఆ పని..?

ఢీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా జరిగిన డాన్స్ పర్ఫామెన్స్ అనంతరం ఫైనల్గా ఇద్దరు డాన్సర్లు వీక్ గా ఉన్నారు. వారిలో ఒకరు మాత్రమే ఉండాలి మరొకరు ఎలిమినేట్ కావాలి. మిగిలిన డాన్సర్లు ఓటు వేసి ఒకరిని సేవ్ చేయాలి. ఈ క్రమంలో ఓ డాన్సర్.. స్టేజ్ పైన ఉన్న సాత్విక్ అనే డాన్సర్ కి కాకుండా పక్కన ఉన్న లేడీ డాన్సర్ కి ఓటు వేశారు. ఇలా ఇద్దరూ అలానే చేశారు. దీన్ని ఇష్యూ చేశాడు జడ్జ్ గా ఉన్న జానీ మాస్టర్. ” మనకు ఒక పవర్ ఇచ్చారంటే ఆ పవర్ ని ఒకరిపై ఉపయోగిస్తున్నామంటే దానికి ప్రాపర్ రీసన్ ఉండాలి ” అంటూ వెల్లడించాడు జానీ మాస్టర్.

Johnny Master, who was angry with Venkatesh's child artist,

దీనికి స్పందించిన డాన్సర్.. నిజం చెప్పాడు. ఓటు వేసే ముందు అన్న.. అక్క ఓటు వెయ్యమని సైగా చేశాడని వెల్లడించాడు. ఇక అంతే జానీ మాస్టర్ కోపంతో ఊగిపోయాడు. తన సీట్ లో నుంచి లెగిసి ఆ కంటెస్టెంట్ ని కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. చివరికి షో నుంచి బయటకు వెళ్ళిపోతూ మైక్లు విసిరేస్తూ గోల గోల చేశాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండగా.. మీరు కూడా మొదలు పెట్టారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Venkatesh)

Join WhatsApp