Jr.NTR donated all the lakhs to that temple

Jr.NTR: సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామందికి దేవుడి పైన నమ్మకం ఉంటుంది. వారు ఇండస్ట్రీలో ఎదగాలన్నా వారికి మంచి మంచి అవకాశాలు రావాలన్నా సరే దేవుడిపై భారం వేస్తూ ఉంటాయి. అయితే ఇండస్ట్రీ జనాలు మాత్రమే కాదు సక్సెస్ కోసం పాకులాడే ఎవరైనా సరే కాస్త వారి ప్రయత్నం ఉంటే మరి కాస్త దేవుడిపై భారం వేస్తూ ఉంటారు. అయితే దేవుడి మీద ఉన్న భక్తితో చాలామంది సెలబ్రిటీలు పెద్ద పెద్ద గుళ్లను కట్టించిన సంగతి మనకు తెలిసిందే.

Jr.NTR donated all the lakhs to that temple

ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆ జిల్లాలోని ఓ గుడికి ఏకంగా లక్షల విరాళం ఇచ్చారట. మరి ఎన్టీఆర్ అన్ని లక్షల విరాళం ఎందుకు ఇచ్చారు.. ఏ గుడికి ఇచ్చారు అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ కి దైవభక్తి ఎక్కువ. ఇక ఈ విషయాన్ని మనం ఇప్పటికే చాలా సందర్భాలలో చూసాం.అయితే ఎన్టీఆర్ గురించి ఒక సీక్రెట్ విషయం తాజాగా బయటపడింది.(Jr.NTR)

Also Read: Alia Bhatt: మెట్ గాలా సీట్ కోసం అలియా భట్ అన్ని లక్షలు ఖర్చు పెట్టిందా..?

అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తూర్పుగోదావరి జిల్లా లోని జగ్గన్నపేట లో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చారు.ఇక ఆ విరాళం వేలల్లో కాదు లక్షల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ 12,50,000 విరాళాన్ని ఆ ఆలయ నిర్మాణానికి అందించారట. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయట పెట్టకపోయినప్పటికీ ఆలయం బయట దాతల పేర్లను శిలాఫలకంపై చెక్కించారు.

Jr.NTR donated all the lakhs to that temple

అలా ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా బయటపడింది.ఇక ఆ శిలాఫలకంపై ఎన్టీఆర్ పేరు, ఎన్టీఆర్ తల్లి శాలిని పేరు, అలాగే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఆయన ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ల పేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మ్యాటర్ కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ కి దైవభక్తి చాలానే ఉంది. గుడి నిర్మాణానికి ఏకంగా అన్ని లక్షల విరాళం ఇచ్చారా అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.(Jr.NTR)

Join WhatsApp