Jr.NTR Loved that heroine deeply before marriage

Jr.NTR: నందమూరి తారక రామారావు.. తాత పేరుని పెట్టుకొని తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఈయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్.. అలాగే ఎన్టీఆర్ దేవర మూవీపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అంతేకాదు ఈ సంవత్సరాన్ని తారక నామ సంవత్సరం గా త్రివిక్రమ్ వంటి కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం చెప్పడం గమనార్హం. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న దేవర సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తున్నారు.

Jr.NTR Loved that heroine deeply before marriage

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి ఏ చిన్న వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టినా అది హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.అయితే అప్పట్లో ఎన్టీఆర్ పెళ్లికి ముందే ఒక హీరోయిన్ ని బాగా ఇష్టపడ్డారట. ఎందుకో తెలియదు కానీ ఆ హీరోయిన్ ని చూసిన తొలిచూపులోనే ఆయన ప్రేమలో పడిపోయారట.కానీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే.. ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ పై చూడగానే ప్రేమ కలిగిందట. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు తాను చేస్తున్నది మంచి పని కాదేమో అనిపించిందట.(Jr.NTR)

Also Read: Heroine: సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. ఎవరంటే..?

ఇక 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనకి ఆ హీరోయిన్ పై అలాంటి భావన కలిగిందని,కానీ ఆ తర్వాత కరెక్ట్ కాదనిపించి వదిలేసానని, కానీ ప్రస్తుతం ఆ విషయం అంతగా అవసరం లేనిదని, దాన్ని ఎప్పుడో వదిలి పెట్టానని, అలాగే ఆ హీరోయిన్ వల్ల నా జీవితంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని,అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తానని, నా లైఫ్ లో తీసుకున్న ఏ డెసిషన్ పట్ల కూడా నేను బాధపడడం లేదు అంటూ ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని బయట పెట్టారు.

Jr.NTR Loved that heroine deeply before marriage

ఇక ఎన్టీఆర్ ప్రేమించిన హీరోయిన్ అనగానే అందరికీ బాలీవుడ్ నటి సమీరారెడ్డి మాత్రమే గుర్తుకొస్తుంది.ఇఈ హీరోయిన్ తో ఎన్టీఆర్ అప్పట్లో ప్రేమలో పడ్డారని, కానీ హరికృష్ణ ఈ విషయంలో కల్పించుకుని ఇద్దరికీ వార్నింగ్ ఇవ్వడంతో ఎన్టీఆర్ తన ప్రేమని వదిలేసుకున్నారనే టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది.(Jr.NTR)

Join WhatsApp