Kajal Aggarwal Reveals Her Favourite Actor In Tollywood

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో కాజ‌ల్ ఒకటి. వరుస అవకాశాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలోనే కాజల్ పెళ్లి పీటలెక్కింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించాడు. కుమారుడు పుట్టిన కొద్ది రోజులకే కాజల్ మళ్ళీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

Kajal Aggarwal Reveals Her Favourite Actor In Tollywood

గత ఏడాది భగవంత్ కేసరి చిత్రంతో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కాజల్ సత్యభామ అని లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ తో కలిసి వర్క్ చేస్తుంది. మరికొన్ని ప్రాజెక్టులు కూడా కాజల్ చేతిలో ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా కాజల్ అగ‌ర్వాల్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ టాలీవుడ్ లో తన మోస్ట్ ఫేవరెట్ హీరో ఎవరో బయట పెట్టింది. సాధారణంగా హీరోయిన్లను మీ ఫేవరెట్ హీరో ఎవరిని అడిగితే మాట దాటేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.

హీరోల ఫ్యాన్స్ తో లేనిపోని తలనొప్పులు ఎందుకని భావిస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న కాజలు కూడా ఫేవ‌రెట్ హీరో గురించి చెప్పింది. కానీ ఎట్టకేలకు ఈ సీక్రెట్ ను ఆమె బయటపెట్టింది. టాలీవుడ్ లో తన మోస్ట్ ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తెలిపింది. ఎన్టీఆర్ తో వర్క్ చేయడం తనకు ఎంతో ఇష్టమ‌ని కూడా కాజల్ పేర్కొంది. అలాగే కోలీవుడ్ లో దళపతి విజయ్ త‌న ఫేవ‌రెట్‌ అని చందమామ నిర్మొహమాటంగా తెలియజేసింది.(Kajal Aggarwal)

Also Read: Shriya Sharma: జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియా గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే అవాక్కైపోతారు!

కాగా ఎన్టీఆర్ తో కాజల్ టెంపర్, బృందావనం చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. మరియు ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన జనతా గ్యారేజ్ లో కాజల్ స్పెష‌ల్ సాంగ్ లో మెరిసింది. అనూహ్యంగా ఈ మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ తో కాజల్ తుపాకీ మూవీలో నటించింది. తుపాకీ ఫలితం గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది.

Join WhatsApp