Kiara Advani eyed on South Star Heroes

Kiara Advani: ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు సౌత్ హీరోలపై కన్నేస్తున్నారు. ఇదే క్రమంలో కియారా అద్వానీ కూడా ఈ పనే చేస్తుంది. మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను అనే సినిమాతో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ బ్యూటీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి జంప్ చేసిన ఈ వయ్యారి అక్కడ కూడా తనదైన రీతిలో దూసుకుపోయింది.

Kiara Advani eyed on South Star Heroes

బై టౌన్ వీధుల్లో ఫేమస్ అయిన కియారా ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ డేట్స్ ఖాళీ లేకుండా బిజీ అయిపోయింది. ఇక ఈమధ్య కియారా వేసే అడుగులు సౌత్ వైపు దారి తీస్తున్నాయి. ప్రజెంట్ అని తెలుగు సినిమాలే చేస్తుంది ఈ భామ. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ మొత్తం సౌత్ హీరోస్ లిస్టులో ఉన్న ఈ భామకి ఒక బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సికిందర్. సాజిద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Also Read: Katrina Kaif: మల్లేశ్వరి సినిమాకి కత్రినా కైఫ్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుందో తెలుసా..!

ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కి జోడిగా కియారా ఎంపికైనట్లు ముంబై వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మే మొదటి వారం నుంచి కియారా ఈ మూవీ షూటింగ్లో పాల్గొని ఉందట. ఎమోషనల్ అండ్ యాక్షన్ చిత్రంగా రానుంది ఈ మూవీ. ఏదేమైనప్పటికీ ఎక్కువగా కీయరా సౌత్ హీరోస్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. టాలీవుడ్ లో ఈమెకి ఉన్న క్రేజ్ ని మరింత పెంచుకునేందుకు అగ్ర హీరోల సరసన నటిస్తూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది.

Kiara Advani eyed on South Star Heroes

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో నటిస్తుంది. ఇక రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ ది ఇది ఫస్ట్ మూవీ కాదు రెండో సినిమా. వినయ విధేయ రామ సినిమాతో వీరిద్దరి కాంబో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఇక ఈ మూవీ అప్పట్లో దుమారం రేపిందనే చెప్పుకోవచ్చు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మను గేమ్ చేంజర్ లో హీరోయిన్గా తీసుకున్నారు. మరి ఈ మూవీ ఏ విధమైన సక్సెస్ అవుతుందో చూడాలి.(Kiara Advani)

Join WhatsApp