Klin Kaara Care Taker Savithri Salary Details Here

Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తమ తొలి బిడ్డకు వెల్కమ్ చెప్పారు. గత ఏడాది జూన్ 20న హైదరాబాదులోని అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు క్లిన్ కారా అంటూ నామకరణం కూడా చేశారు. అయితే ఇంతవరకు క్లిన్ కారా ముఖాన్ని మీడియాకు రివీల్ చేయ‌లేదు.

Klin Kaara Care Taker Savithri Salary Details Here

మెగా ఫ్యాన్స్‌ ఎంత రిక్వెస్ట్ చేసినా రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం తమ కూతురు ఫేస్ ను చూపించేందుకు అంగీకరించలేదు. మెగాఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ చిన్న‌రి ముఖాన్ని ఎమోజీలతో కవర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.‌. క్లిన్ కారాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురుని చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ ను నియమించుకున్నార‌ట‌.

ప్రస్తుతం రామ్ చరణ్ చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాడు. మరోవైపు మెగాకోడలు ఉపాసన పై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అపోలో హాస్పటల్ వ్యవహారాలతో పాటు ఆమె సొంతంగా ప‌లు వ్యాపార‌లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే క్లిన్ కారా ఆలనా పాలనా చూసుకునేందుకు ఒక నానీ (కేర్ టేకర్ లేదా ఆయా)ను ఏర్పాటు చేసుకున్నారట. ఆమె పేరు సావిత్రి. ముంబైలో ఉంటారు.(Klin Kaara)

Also Read: Mahesh Babu: జ‌ర్మ‌నీ అడ‌వుల్లో మ‌హేష్ బాబు ధ‌రించిన ఆ జాకెట్ ధ‌ర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

సావిత్రి బ్యాక్ గ్రౌండ్ విష‌యానికి వ‌స్తే.. గతంలో పలువురు సెలబ్రిటీల పిల్లలకు ఆమె కేర్ టేక‌ర్ గా వ్యవహరించారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కొడుకు తైమూర్ కు సావిత్రి కేర్ టేక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. అలాగే బాలీవుడ్ స్టార్ షాహిద్ క‌పూర్ ఇంట్లోనూ సావిత్రి వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మెగా వార‌సురాలు క్లిన్ కారాను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు త‌మ కూతురితో క‌లిసి ముంబై వెళ్లారు. ఆ స‌మ‌యంలో కూడా సావిత్రి వారితో పాటే క‌నిపించారు. ఇక క్లిన్ కారాను చూసుకోవ‌డానికి ఆమె భారీగానే జీతం తీసుకున్నారు. సావిత్రికి రామ్ చ‌ర‌ణ్ నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర చొప్పున జీతం ఇస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Join WhatsApp