Krithi Shetty Worried About Her Career In Tollywood

Krithi Shetty: చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న నేటి త‌రం హీరోయిన్ల‌లో కృతి శెట్టి ఒక‌టి. మంగళూరుకు చెందిన ఈ అందాల భామ‌.. 2021లో వ‌చ్చిన ఉప్పెన మూవీతో హీరోయిన్ గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయింది. బుచ్చిబాబు తెర‌కెక్కిన ఈ చిత్రం క‌రోనా స‌మ‌యంలోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఇందులో బేబ‌మ్మ పాత్ర‌లో కృతి శెట్టి అందం, న‌ట‌నా అభినయం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

Krithi Shetty Worried About Her Career In Tollywood

ఉప్పెన త‌ర్వాత శ్యామ్ సింగ రాయ్‌, బంగార్రాజు చిత్రాల‌తో మ‌రో రెండు హిట్లు వ‌రుస‌గా ప‌డ‌టంతో కృతి శెట్టి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. కానీ, ఆ త‌ర్వాత కృతి శెట్టి బ్యాడ్ టైమ్ ప్రారంభ‌మైంది. బంగార్రాజు త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ ఆమె ఖాతాలో ప‌డ‌లేదు. ది వారియ‌ర్‌, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, క‌స్ట‌డీ చిత్రాల రూపంలో కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ ప‌రాజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుంది.

ఆ దెబ్బ‌తో కృతి శెట్టి వైపు టాలీవుడ్ హీరోలు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ప‌రిస్థితి చాలా దారుణంగా మారింది. శ‌ర్వానంద్ 35వ చిత్రంలో కృతి శెట్టి న‌టిస్తోంది. క‌స్ట‌డీ విడుద‌ల‌కు ముందు సైన్ చేసిన ప్రాజెక్ట్ చేసింది. చాలా కాలం క్రిత‌మే ఈ సినిమా ప్రారంభం అయినా.. ఇంత వ‌ర‌కు స‌రైన అప్డేట్స్ లేవు. ఇక‌పోతే క‌స్ట‌డీ త‌ర్వాత కృతి శెట్టికి ఒక్క తెలుగు సినిమా కూడా రాలేదు. భారీ పోటీ, దానికి తోడు వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా కృతి శెట్టిని తెలుగు ఇండ‌స్ట్రీ మెల్ల‌మెల్ల‌గా ప‌క్క‌న పెట్టేస్తోంది. దాంతో ఈ అమ్మడు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షోకు తెర లేపింది.(Krithi Shetty)

Also Read: Nagarjuna: ఆ మాటన‌గానే చైతు, అఖిల్ న‌న్నొక పిచ్చోడిలా చూశారు.. నాగార్జున ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్‌!

హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో నెట్టింట కాక రేపుతోంది. గ్లామర్ పాత్రల అయినా చేస్తాన‌ని హింట్ ఇస్తోంది. అలాగే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కూడా ఎలాంటి ప‌ట్టింపులు లేకుండా ఇచ్చినంత తీసుకుంటాన‌ని త‌న మేనేజ‌ర్ ద్వారా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు తెలియ‌జేస్తోంద‌ట‌. అయినా స‌రే ఆమెకు ఆఫ‌ర్లు ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, కృతి శెట్టి ప్ర‌స్తుతం త‌మిళంలో మూడు మ‌రియు మ‌ల‌యాళంలో ఒక సినిమాలో న‌టిస్తోంది. టాలీవుడ్ లో మాత్రం ఆఫ‌ర్లు నిల్ అనే చెప్పొచ్చు.

Join WhatsApp