Kriti Kharbanda marraige

Kriti Kharbanda: సౌత్, నార్త్ లో హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన కృతి కర్బందా తాజాగా తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది.గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మార్చి 15న పెళ్లి పీటలు ఎక్కింది. అయితే వీరి పెళ్లి హర్యానా లోని గురుగ్రామ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.అయితే తన పెళ్లికి సంబంధించిన పెళ్లి ఫోటోలను ఈ హీరోయిన్ కాస్త లేటుగా తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుంది.

Kriti Kharbanda marraige

ఇక ఈ ఫోటోలో కృతికర్బంద పులకిత్ సామ్రాట్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటలా కనిపిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ జంట గురించి ఒక ఆశ్చర్యపోయే న్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే కృతికర్బందా పెళ్లి చేసుకుంది మొదటి పెళ్లి వాడిని కాదట. రెండో పెళ్లి వాడినట..మరి ఇంతకీ పులకిత్ సామ్రాట్ మొదట పెళ్లి చేసుకుంది ఎవరిని.. ఆయన మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. (Kriti Kharbanda)

Also Read: Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్ మమితాకు వింత అనుభ‌వం.. ఏకంగా స్టేజ్‌పైనే అలాంటి ప‌ని చేసి షాకిచ్చిన తెలుగు అభిమాని!

చాలామంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో రెండో పెళ్లి వాడిని ఇష్టపడుతున్నారు.ఎందుకంటే రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోయే వాడు కూడా రెండో పెళ్లి వాడే.. అలాగే హన్సిక కూడా రెండో పెళ్లి వాడినే పెళ్లాడింది. అయితే తాజాగా కృతికర్బందా కూడా రెండో పెళ్లి వాడైనా పులకిత్ సామ్రాట్ ని పెళ్లాడింది.

Kriti Kharbanda marraige

ఇక పులకిత్ సామ్రాట్ కూడా ఇది రెండో పెళ్లట.2014లోనే ఈయన శ్వేత రోహిరా అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. కానీ పెళ్లి చేసుకొని కనీసం ఏడాది కూడా గడవకుండానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారట. ఇక ఆ తర్వాత 2019లో పులకిత్ కృతికర్బంధాతో ప్రేమలో పడ్డాడు. అలా ఐదు సంవత్సరాలుగా వీరి రిలేషన్ ని కంటిన్యూ చేస్తూ చివరికి మార్చి 15న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంటకి సెలబ్రిటీలతోపాటు అభిమానులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(Kriti Kharbanda)

Join WhatsApp