Kriti Shetty Assets

Kriti Shetty: కొంతమంది హీరోయిన్స్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆస్తులు మాత్రం బాగా కూడబెడతారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార ప్రకటనలు,ఈవెంట్స్ వంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ కూడా కొన్ని సినిమాలను నటించినప్పటికి కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదించింది. ఆమె ఎవరో కాదు కృతి శెట్టి..బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా చేసిన ఉప్పెన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

Kriti Shetty Assets

ఇందులో చేసిన వాళ్లందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అలా కృతి శెట్టి ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంది. అలా కృతి శెట్టి నటించిన బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత ఈమె చేసిన అన్ని సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి దాంతో హీరోయిన్ క్రేజ్ క్రమక్రమంగా టాలీవుడ్ లో తగ్గిపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ కూడా కొంతమంది హీరోలతో నటించే అవకాశం అందుకుంది. (Kriti Shetty)

Also Read: Varalakshmi Sarathkumar: నేను స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు?.. ఇండస్ట్రీ రాకపై కామెంట్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!

ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు అవకాశాల కోసం సోషల్ మీడియాని ప్రధానాస్త్రంగా మలుచుకొని సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఛాన్స్ ల కోసం పాకులాడుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తన ఒక్కో మూవీకి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇక సినిమాలు హిట్ అయ్యాక తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచి కోటి నుండి కోటి యాభై లక్షల వరకు తీసుకుంది.

Kriti Shetty Assets

అలా మంచి ఫామ్ లోకి వచ్చాక ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్, వాణిజ్య ప్రకటనలు వంటివి చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి దాదాపు 30 కోట్ల ఆస్తిపాస్తులు అలాగే ఖరీదైన కార్లు ఈమె పేరు మీద ఓ లగ్జరీ ఇల్లు కూడా ఉందట. ఇక కృతి శెట్టి తండ్రి బెంగళూరులో ఒక పేరున్న వ్యాపారవేత్త.. ఇక తండ్రి సంపాదించిన ఆస్తులు కాకుండానే కృతి శెట్టి సొంతంగా 30 కోట్ల ఆస్తులు సంపాదించినట్టు టాక్ వినిపిస్తోంది.(Kriti Shetty)

Join WhatsApp