Lal Salam: Rajinikanth's new film

Lal Salam: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజిని మంచి విజయాన్ని సాధించుకున్నాడు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ ” లాల్ సలాం ” అని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ పై రజినీకాంత్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Lal Salam: Rajinikanth’s new film

ఈ మూవీ ఈనెల తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా సందడి చెయ్యనుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో భారీ హైట్ నెలకొల్పారు. ఇక దీంతో వరుస ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ సినిమాని ప్రజల్లో గట్టిగా తీసుకెళ్లేందుకు సతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: Face: అందమైన స్కిన్ ని పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయిపోండి..!

ఇక ఈ మూవీ షూటింగ్ నాటి నుంచి నేటి వరకు ఈ సినిమా విషయంలో ఏదో ఒక వివాదం నెలకొంటూనే ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని అరబ్దేశాలు బ్యాన్ చేశాయి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అంటూ ఈ సినిమాపై నిషేధం విధించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Lal Salam: Rajinikanth's new film

ఇక ఈ వార్త విన్న రజినీకాంత్ అభిమానులు..” ఎన్నో సినిమాలు అలానే ఉన్నాయి. మరి ఆవాటినే బ్యాన్ చేయకుండా ఇప్పుడు దీన్ని మాత్రమే ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? గతంలో రిలీజ్ అయిన అనేక సినిమాలు దీనికన్నా బేభత్సంగా ఉన్నాయి. దీనిని మేము ఖండిస్తున్నాము ” అంటూ ఫైర్ అవుతున్నారు.(Lal Salam)

Join WhatsApp