Lavanya Tripathi About Mega Family Conditions

Lavanya Tripathi: అందాల రాక్షసి మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి.. గ‌త ఏడాది ఓ ఇంటికి అయిన సంగ‌తి తెలిసిందే. ప్రియు స‌ఖుడు, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ను వివాహం చేసుకుని కొణిదెల వారింటికి కోడలు అయింది. వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబరు 1న ఇటలీ సియెనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వివాహం అనంత‌రం వ‌రుణ్ తేజ్ చేతి నిండా సినిమాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు.

Lavanya Tripathi About Mega Family Conditions

మ‌రోవైపు లావ‌ణ్య త్రిపాఠి కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. అయితే పెళ్లి త‌ర్వాత యాక్టింగ్ మానేయాల‌ని లావ‌ణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ కండీష‌న్స్ పెట్టిందంటూ గ‌తంలో పెద్ద ఎత్తున్న ప్ర‌చారం జ‌రిగింది. తొలిసారి ఈ విష‌యంపై లావ‌ణ్య త్రిపాఠి ఓపెన్ అయింది. ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్ర‌మోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో లావణ్య త్రిపాఠి, బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Lavanya Tripathi About Mega Family Conditions

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో విశ్వక్ ఖండేరావు డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరీ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. అభిజ్ఞ, హర్ష వర్ధన్, మహేశ్ విట్టా, సునైనా త‌దిత‌రులు ఈ సిరీస్ లో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్, ట్రైల‌ర్ సిరీస్‌పై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. అయితే ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో లావ‌ణ్య త్రిపాఠి అండ్ టీమ్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో విష‌యాలు పంచుకుంది.(Lavanya Tripathi)

Also Read:,NTR: ఆహ్వానం అందినా ఎన్టీఆర్ అయోధ్య‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఆ హీరోనేనా..?

వివాహం త‌ర్వాత యాక్టింగ్‌, సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌లో వ‌రుణ్ మ‌రియు అత‌ని ఫ్యామిలీ త‌న‌కు ఎలాంటి కండీష‌న్స్ పెట్టలేద‌ని లావ‌ణ్య త్రిపాఠి స్ప‌ష్టం చేసింది. కెరీర్ ప‌రంగా అంతా ఫుల్ స‌పోర్ట్‌గా ఉంటున్నార‌ని చెప్పుకొచ్చింది. సినిమాలు, క్యారెక్ట‌ర్స్ విష‌యంలో త‌న‌కంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయ‌ని.. వాటిని దాట‌కుండానే కెరీర్‌ను కొన‌సాగిస్తాని లావ‌ణ్య తెలిపింది. అలాగే మెగా కోడ‌లి ట్యాగ్ పై కూడా ఆమె మాట్లాడింది. వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి ద్వారానే మెగా కోడ‌లు అనే పిలుపు వ‌చ్చింది.. ఆ పిలుపు త‌న బాధ్య‌త‌ను పెంచింద‌ని లావ‌ణ్య త్రిపాఠి వెల్ల‌డించింది.

Join WhatsApp