Lavanya Tripati Pregnent

Lavanya Tripati: ఏంటి లావణ్య త్రిపాఠి నిజంగానే తల్లి కాబోతుందా.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కి అర్థం అదేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా కోడలుగా మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి గురించి నెట్టింట్లో ఏ చిన్న వార్త వినిపించినా కూడా మెగా ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా లావణ్య త్రిపాటి తల్లి కాబోతోంది అనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Lavanya Tripati Pregnent

గత ఏడాది నవంబర్ 2న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి మనకు తెలిసిందే.ఇక వీరి పెళ్లి తర్వాత హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ పార్టీ కూడా అరేంజ్ చేశారు. అయితే వీరి పెళ్లయి దాదాపు 5 నెలలు దాటింది. తాజాగా లావణ్య త్రిపాటి తల్లి కాబోతుంది అంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ వార్త చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే..(Lavanya Tripati)

Also Read: Samantha: లగ్జరీ వాచ్ పెట్టుకున్న సమంత.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

తాజాగా సోషల్ మీడియా ఖాతాలో లావణ్య త్రిపాటి పింక్ కలర్ లో ఉండే రూబీ చెవి కమ్మలను పెట్టుకొని లేత గులాబీ రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో షేర్ చేసింది.అలాగే ఆ ఫోటో కింద అమ్మ చెవి దిద్దులు పెట్టుకున్నాను చిన్నప్పటి గుర్తుకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

Lavanya Tripati Pregnent

అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ వేరే విధంగా అర్థం చేసుకొని లావణ్య త్రిపాఠి ఎదురు చూసేది ప్రెగ్నెన్సీ గురించి కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.కానీ ఆమె పోస్ట్ పెట్టింది మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న దానికి సంబంధించి.. ఈ మ్యాటర్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటున్నారు.అలా లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది అనుకున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Lavanya Tripati)

Join WhatsApp