List Of Film Actors Who Received Padma Vibhushan Award

Padma Vibhushan: గణతంత్ర దినోత్సవం పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్ర‌భుత్వం గురువారం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదికి గానూ మొత్తం 132 మందికి అవార్డులు అనౌన్స్ చేశారు. 5 మందికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ పుర‌స్కారాలు ద‌క్కాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారం అయిన పద్మ విభూషణ్ వ‌రించింది. దీంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు చిరంజీవికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

List Of Film Actors Who Received Padma Vibhushan Award

ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి కంటే ముందు ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని అందుకున్న హీరోలు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియ‌న్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో పద్మ విభూషణ్ అందుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారే. 2011లో ఆయ‌న ఈ ప్ర‌తిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత 2015లో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్ ల‌ను పద్మ విభూషణ్ పుర‌స్కారం వ‌రించింది.

Also Read: Niharika Konidela: విడాకుల‌కు కార‌ణం అదే.. కుండ బ‌ద్ద‌లు కొట్టేసిన నిహారిక‌!

2016లో సూపర్ స్టార్ రజినీకాంత్ పద్మ విభూషణ్ గ్ర‌హీత‌గా నిలిచారు. తెలుగునాట ఏఎన్నార్ తర్వాత పద్మ విభూషణ్ అందుకున్న తెలుగు హీరోగా చిరంజీవి రెండో స్థానాన్ని ద‌క్కించుకున్నారు. అత్యున్నత పురస్కారం ద‌క్క‌డంతో మాటలు రావడం లేదంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేర‌కు ఓ వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.(Padma Vibhushan)

List Of Film Actors Who Received Padma Vibhushan Award

కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు, నీడలా తనతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ది సాధ్య‌మైందని చిరంజీవి వీడియో చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఏడాది మెగాస్టార్ తో పాటు త‌మిళ‌నాడుకు చెందిన సీనియ‌ర్ న‌టి వైజయంతి మాల బాలి, భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, బిహార్ కు చెందిన బిందేశ్వర్‌ పాఠక్‌, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్పవరపు వెంకయ్య నాయుడు కూడా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.

Join WhatsApp