List Of Top 10 Tollywood Heroes Based On Theatrical Business

Tollywood Heroes: గ‌త కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతోంది. ఒక‌ప్పుడు తెలుగు సినిమాల బిజినెస్ లు రూ. 100 కోట్ల మార్క్ ని ట‌చ్ చేయ‌డం అంటే పెద్ద గ‌గ‌నం అయిపోయేది. కానీ, బ‌హుబ‌లి విడుద‌ల త‌ర్వాత ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగింది. బిజినెస్ విష‌యంలో తెలుగు సినిమాలు అకాశ‌మే హ‌ద్దు అన్నట్లుగా దూసుకెళ్తున్నాయి. టాప్ హీరోల సినిమాలైతే షూటింగ్ పూర్తి కాక‌ముందే బిజినెస్ మొదలు పెడుతున్నాయి. క్రేజ్ కి తగ్గట్టు బేరసారాలు జ‌రుగుతున్నాయి.

List Of Top 10 Tollywood Heroes Based On Theatrical Business

ఈ నేప‌థ్యంలోనే గత 3 చిత్రాల థియేట్రికల్ బిజినెస్ మరియు రాబోయే చిత్రాల ఎస్టిమేటెడ్‌ బిజినెస్ ఆధారంగా టాప్‌-10లో ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో మొద‌టి స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఉన్నాడు. స‌లార్(రూ. 345 కోట్లు), ఆదిపురుష్‌(రూ. 240 కోట్లు), రాధేశ్యామ్(రూ. 202.80 కోట్లు) మ‌రియు రాబోయే క‌ల్కీ 2898 ఏడీ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ తో ప్ర‌భాస్ టాప్-1 లో నిలిచాడు.

ఆ త‌ర్వాత పుష్ప ది రైజ్‌, అల వైకుంఠపురములో, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మ‌రియు త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే పుష్ప 2 థియేట్రిక‌ల్ బిజినెస్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే మూడు స్థానంలో ఆర్ఆర్ఆర్‌, వినయ విధేయ రామ, రంగ‌స్థ‌లం మ‌రియు అప్ క‌మ్మింగ్ మూవీ గేమ్ ఛేంజ‌ర్ బిజినెస్ ఆధారంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడు. గ‌త మూడు చిత్రాలు మ‌రియు రాబోయే దేవ‌ర బిజినెస్ తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు నాలుగో స్థానం ద‌క్కింది.(Tollywood Heroes)

Also Read: Amy Jackson: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అమీ జాక్స‌న్‌.. సినిమా స్టైల్ లో ప్రియుడితో ఎంగేజ్మెంట్‌!

గుంటూరు, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరుతో పాటు రాజ‌మౌళితో చేయ‌బోయే సినిమా బిజినెస్ ప్ర‌కారం మ‌హేష్ బాబు ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బ్రో, భీమ్లా నాయ‌క్‌, వ‌కీల్ సాబ్ తో పాటు అప్ క‌మ్మింగ్ మూవీ ఓజీ థియేట్రిక‌ల్ బిజినెస్ తో ఆరు స్థానానంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిలిచారు. గ‌త మూడు చిత్రాలు మ‌రియు రాబోయే సినిమా బిజినెస్ ఆధారంగా ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో వ‌రుస‌గా చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాని ఉన్నారు. ఇక ప‌దో స్థానాన్ని విజ‌య్ దేర‌వ‌కొండ ద‌క్కించుకున్నారు. ఖుషి, లైగ‌ర్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ మ‌రియు ఫ్యామిలీ స్టార్ మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ తో ఆయ‌న టాప్-10లో నిలిచారు.

Join WhatsApp