Love Affair Rumours On Actor Prabhas And Here List Of Actressess

Prabhas: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే దాదాపు ప్రతి ఒక్కరు చెప్పే పేరు ప్రభాస్. కెరీర్‌ పరంగా ఈయన సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం అందరికంటే బాగా వెనకబడ్డాడు. నాలుగు పదుల వయసు వచ్చి నాలుగేళ్లవుతున్న ఇంకా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఆయన వయసు హీరోలంతా పెళ్లి చేసుకుని పిల్లలను కనేసి.. వారిని ఇండస్ట్రీకి లాంచ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు.

Love Affair Rumours On Actor Prabhas And Here List Of Actressess

కానీ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి పీటలే ఎక్కలేదు. వివాహం గురించి పక్కన పెడితే.. ప్రభాస్ పై గతంలో ఎన్నోసార్లు ప్రేమ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లతో డార్లింగ్ ప్రేమాయ‌ణం నడుపుతున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ జాబితాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అనుష్క శెట్టి. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో ప్రభాస్, అనుష్క స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ లో వీరి బాండింగ్ చూసి అందరూ అనుష్క-ప్రభాస్ ప్రేమలో ఉన్నారని భావించారు.

ప్రభాస్, అనుష్క పెళ్లి ఖరారు అయినట్లు మీడియాలో అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కానీ అటు ప్రభాస్ ఇటు అనుష్క ఇద్దరూ తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉన్నాయి. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో పడినట్లు ఇటీవ‌ల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ ఆదిపురుష్‌ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించిందని.. పెళ్లి కూడా చేసుకుంటారని మీడియా కోడై కోసింది. కానీ చివరకు అవి పుకార్లుగానే మిగిలాయి.(Prabhas)

Also Read: Allu Arjun: కెరీర్ మొత్తంలో అల్లు అర్జున్ ను బాగా బాధ‌పెట్టిన రెండు సినిమాలు ఇవే..!!

గతంలో ప్రభాస్, త్రిష మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరిగింది. వర్షం, పౌర్ణమి సినిమాలు చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య లవ్ పుట్టిందని గుసగుసలు వినిపించాయి. అయితే త్రిష ఈ వార్తను కొట్టి పారేసింది. అలాగే గోవా బ్యూటీ ఇలియానా, ప్రభాస్ ప్రేమలో ఉన్నారని తెలుగు మీడియాలో ప్రచారం జరిగింది. వీరు మున్న సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఇలియానాతో ప్రభాస్ కు రిలేషన్ ఏర్పడిందని రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఇక మెగా డాటర్ నిహారిక తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరి పెళ్లి ఖాయమైందని కూడా ప్రచారం జరిగింది. దాంతో నిహారిక స్వయంగా స్పందించింది. ప్రభాస్ తో ప్రేమ, పెళ్లి వార్తలు పూర్తిగా ఆవాస్తమని స్పష్టం చేసింది.

Join WhatsApp