Madhuri Dixit Saree cost

Madhuri Dixit: బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ అంటే తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితురాలు. ఈమె బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ హోదాలో చాలా సంవత్సరాలు కొనసాగింది.ఇక బాలీవుడ్లో 10 సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు.కానీ ఈ హీరోయిన్ 10 సంవత్సరాలు కాదు ఇప్పటికి కూడా తన అందం, అభినయంతో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది.

Madhuri Dixit Saree cost

55 ఏళ్ల వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ ఇంకా పాతికేళ్ల అమ్మాయి లాగే ఉండడంతో చాలామంది ఈమె అందంగా ఉండడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటారు.అయితే తాజాగా సూరత్ లోని ఓ స్టోర్ ఓపెనింగ్ కి వెళ్ళిన మాధురి దీక్షిత్ కట్టుకున్న చీర ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. (Madhuri Dixit)

Also Read: Keerthy Suresh: ఖరీదైన చీర కట్టిన కీర్తి సురేష్.. ధర ఎంతో తెలిస్తే షాకే..?

మాధురి దీక్షిత్ బంగారు వర్ణంలో ఉన్న చీరను ధరించింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోలో మాధురి దీక్షిత్ అచ్చం దేవకన్యలా కనిపించడమే కాదు ఆమె కట్టుకున్న చీర ఖరీదు కూడా ఎక్కువే..

Madhuri Dixit Saree cost

మరి ఇంతకీ మాధురి దీక్షిత్ కట్టుకున్న చీర ఖరీదు ఎంత అనుకుంటున్నారా.. ఆమె కట్టుకున్న చీర ఖరీదు అక్షరాల 1,25,000.. ప్రస్తుతం ఈ చీర ఖరీదు తెలిసి చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.(Madhuri Dixit)

Join WhatsApp