Mahesh Babu Blackmailed his Father Saying Refuse a Film with that Hero or Lose Me

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే గుంటూరు కారం మూవీతో అభిమానులను పలకరించి త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నప్పటికీ సినిమాకి సంబంధించిన న్యూస్ బయట పెట్టడం లేదు. అయితే ఈ మధ్యనే మహేష్ బాబు జర్మనీ వెళ్లారు. అది కూడా రాజమౌళి సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి తన ఫిట్నెస్ ని మెరుగుపరచుకోవడం కోసం జర్మనీలో ఉన్న ఓ డాక్టర్ ని కలిసినట్టు సమాచారం.

Mahesh Babu Blackmailed his Father Saying Refuse a Film with that Hero or Lose Me

ఇక ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక కృష్ణ కి హీరోగా అవకాశాలు తగ్గాక కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే గతంలో ఓ స్టార్ హీరో సినిమాలో తాత పాత్రలో చేస్తానని కృష్ణ అంటే నువ్వు ఆ మూవీ లో చేస్తే నీతో మాట్లాడను అని కృష్ణని మహేష్ బాబు బ్లాక్ మెయిల్ చేశారట.ఇక అసలు విషయం ఏమిటంటే..రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ రామ్ చరణ్ తాతయ్యగా చేశారు. (Mahesh Babu)

Also Read: Anitha: హీరోయిన్ అనిత ఆ లేడీ ప్రొడ్యూసర్ తో నిజంగానే ఎఫై** పెట్టుకుందా..?

అయితే ఈ పాత్ర ముందుగా కృష్ణ కి వచ్చిందట. కృష్ణ కూడా తనకి స్టోరీ బాగా నచ్చి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారట. అయితే ఈ విషయం తెల్సిన మహేష్ బాబు నువ్వు ఆ సినిమాలో నటిస్తే నేను నీతో నేను మాట్లాడను అని మొహం మీదే చెప్పారట. ఇక ఈ విషయం అప్పట్లో మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామందికి రామ్ చరణ్ అంటే మహేష్ బాబుకి ఇష్టం లేదు కావచ్చు. అందుకే తన తండ్రిని ఆ సినిమాలో నటించవద్దని చెప్పారు అని నెగిటివ్ కామెంట్స్ చేశారు.

Mahesh Babu who blackmailed his father saying that he will not even see your face if you act with that hero

అయితే అసలు విషయం ఏమిటంటే.. గోవిందుడు అందరివాడేలే సినిమాలో ప్రకాష్ రాజ్ కర్ర సాములు వంటివి చేసి హీరోకి సమానమైన పాత్ర చేసిన సంగతి మనకు తెలిసిందే.అంతేకాదు ఇలాంటి పాత్రలో వయసు మీద పడ్డ కృష్ణ నటించడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ సినిమా కోసం రెండు నెలలు డేట్స్ ఇవ్వాల్సి ఉంది.దాంతో మహేష్ బాబు ఈ విషయం గురించి ఆలోచించి కృష్ణకి సినిమా షూటింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి అనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో నటించకూడదని చెప్పారట. (Mahesh Babu)

Join WhatsApp