Mahesh Babu Received Huge Remuneration From PhonePe

Mahesh Babu: ఇటీవ‌ల గుంటూరు కారం మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌డానికి రెడీ అవుతున్నారు. మ‌హేష్ కెరీర్ లో 29వ ప్రాజెక్ట్ ఇది. గ‌త ఏడాది నుంచే ఈ సినిమా ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మహేష్ బాబు కేవలం తెరపైనే కాదు ఎండార్స్‌మెంట్స్‌లో కూడా స్టారే. శీతల పానీయాల నుండి మొబైల్ ఫోన్‌ల వరకు వివిధ బ్రాండ్‌లు మరియు కంపెనీలతో మ‌హేష్ బాబు అనుబంధం కలిగి ఉన్నాడు.

Mahesh Babu Received Huge Remuneration From PhonePe

తాజాగా మరో ప్రముఖ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్ గా మారిపోయారు మహేష్‌ బాబు. డిజిటల్ మనీ ట్రాన్సఫర్ యాప్‌ ఫోన్ పే తన స్మార్ట్ స్పీకర్ల కోసం ప్రత్యేకమైన సెలబ్రిటీ వాయిస్ ఫీచర్‌ను పరిచయం చేయడానికి మహేష్ బాబుతో జతకట్టింది. ఇంతకాలం ఫోన్‌ పే నుంచి పేమెంట్స్ చేసేటప్పుడు.. మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తూ వ‌చ్చింది. కానీ, ఇక‌పై కంప్యూట‌ర్‌ వాయిస్ కి బదులు మహేష్ బాబు వాయిస్ వినిపించనుంది.

ఫోన్‌ పే వారు మహేష్ బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకుని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారు. దీంతో ఇక‌పై ఏదైనా బిల్లును స్కాన్ చేసి న‌గ‌దు చెల్లింపు చేస్తే.. రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ స్మార్ట్ స్పీకర్లలో మ‌హేష్ యొక్క‌ ఐదు సెక‌న్ల వాయిస్ వినిపిస్తుంది. గ‌తంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ కోసం తన వాయిస్‌ను ఇచ్చారు. ఆయ‌న త‌ర్వాత వాయిస్‌ ఇచ్చిన నటుడు మహేష్ బాబే కావ‌డం విశేషం.(Mahesh Babu)

Also Read: Tripti Dimri: బ‌డా వ్యాపార‌వేత్త ప్రేమ‌లో యానిమ‌ల్ బ్యూటీ.. త్రిప్తి ప్రియుడిని చూసి కుల్లుకుంటున్న కుర్రాళ్లు!

ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ ఏంటంటే.. ఫోన్ పేకి తన వాయిస్ ఇచ్చినందుకు గానూ మహేష్ బాబు ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేశాడ‌ట‌. ఐదు సెక‌న్ల వాయిస్‌కు రూ. 5 కోట్లు అన్నమాట‌. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఇది మ‌రీ టూ మ‌చ్ అని కొంద‌రు అంటుంటే.. మ‌హేష్ క్రేజ్ కు ఏ మాత్రం ఉండాల‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఫోన్ పేతో మహేష్ యొక్క ఈ ఎండార్స్‌మెంట్ ఒప్పందం ఇండ‌స్ట్రీలో అత్యున్నతమైన వాటిలో ఒకటి అని చెప్పాలి.

Join WhatsApp