Mahesh Babu reject the movie

Mahesh Babu: కొంతమంది హీరోలు హీరోయిన్లు ఎవరైనా సరే వారికి వాళ్ళు చేయబోయే సినిమాలో ఏ చిన్న అంశం నచ్చకపోయినా సరే మొహం మీదే రిజెక్ట్ చేస్తూ ఉంటారు.ఇక మరి కొంతమంది రెమ్యూనరేషన్ నచ్చకనో లేక అందులో ఉండే సన్నివేశాలు నచ్చకనో రిజెక్ట్ చేస్తూ ఉంటారు.అయితే కొంతమంది నటీ నటులు చాలా సిల్లీ సిల్లీ రిజన్స్ తో మూవీస్ ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఒక విషయమే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mahesh Babu reject the movie

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఒక చిన్న రీజన్ తో దాదాపు ఏడాదిన్నర ఆడిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో హీరో అవకాశాన్ని మిస్ చేసుకున్నారట. మరి ఆ సినిమా ఏంటి.. ఎందుకు రిజెక్ట్ చేసారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. మహేష్ బాబు ఇప్పటికే చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు. అయితే అందులో ఒకటే నువ్వే కావాలి మూవీ.. తరుణ్, రీచా పనాయ్ హీరో హీరోయిన్ గా చేసిన నువ్వే కావాలి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి దాదాపు సంవత్సరంన్నరపాటు థియేటర్లలో ఆడిందట.(Mahesh Babu)

Also Read: Sunil: చిరంజీవి రాజకీయాల గురించి సంచలన కామెంట్స్ చేసిన సునీల్..!

విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వే కావాలి మూవీకి త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు.అలాగే స్రవంతి రవి కిషోర్, రామోజీరావులు ఈ మూవీని నిర్మించారు.అయితే మొదట నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ సినిమా లోని లవ్ స్టోరీ కి మహేష్ బాబు అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతారు అని అనుకున్నారట.ఈ ఉద్దేశంతోనే మహేష్ బాబుని అడగగా నా ఇమేజ్ కి ఈ సినిమా కథ అస్సలు సెట్ అవ్వదు నేను ఇందులో నటించను అని చెప్పారట.ఇక మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో చేసేదేమీ లేక మూవీ మేకర్స్ వేరే హీరోని సంప్రదించారట.

Mahesh Babu reject the movie

అలా అక్కినేని సుమంత్ ని కూడా ఈ సినిమాలో హీరోగా అనుకున్నప్పటికీ ఆయన కూడా ఈ మూవీలో నటించలేదు.అలాగే బాలీవుడ్ నటుడు అప్తాబ్ దాసనీ తో కూడా తీయాలి అనుకున్నారట.కానీ అదీ కుదరలేదు. ఇక చివరికి తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించి స్టార్ హీరోగా మారారు.అలా కోటి రూపాయల బడ్జెట్ పెట్టి నువ్వే కావాలి మూవీ తీస్తే బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా దాదాపు 20 థియేటర్లలో 250 రోజులు ఆడిందట. అంతేకాదు కొన్ని థియేటర్లలో అయితే దాదాపు సంవత్సరంన్నరపాటు ఈ సినిమాని మార్నింగ్ లేదా నైట్ షోలలో ప్రదర్శించారట. అలా బ్లాక్ బస్టర్ హిట్ అయిన నువ్వే కావాలి మూవీ ని మొదట మహేష్ బాబు రిజెక్ట్ చేశారట

Join WhatsApp