Mahesh Babu Trivikram Combo fourth movie

Mahesh Babu: మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ రివ్యూస్ ను అందుకుంది. అయితే కలెక్షన్స్ కి ఏమాత్రం డోకా లేదనే చెప్పాలి. మహేష్ బాబు కెరీర్ లో మంచి సినిమాగా గొప్ప కలెక్షన్స్ ను అందుకుంది. ఏదేమైనా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే రాజమౌళి సినిమా పై అందరు దృష్టి ఇప్పుడు నెలకొంది.

Mahesh Babu Trivikram Combo fourth movie

రాజమౌళి గత కొన్ని నెలలుగా ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఇది తప్పకుండా ఇద్దరి కెరీర్ లలోనే గొప్ప సినిమా గా నిలబడే సినిమా గా నిలిచిపోవాలని భావిస్తున్నారు. ఇటు మహేష్ కూడా ఈ సినిమా కోసం గట్టిగా పనిచేయాలని భావిస్తున్నాడు. అందుకే ఇప్పుడు జర్మని టూర్ కి కూడా వెళ్లాడట. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా చేయాలని అందుకే అక్కడి టెక్నిషియన్స్ తో కలిసి ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఇది మహేష్ కి హాలీవుడ్ ఎంట్రీ లాంటి సినిమా అని చెప్పొచ్చు. (PakkaTelugu)

త్వరలోనే ఈ సినిమా ప్రారంభం పై ఓ స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే మహేష్ తో కలిసి మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఆయనతో మరో సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. చేసే దమ్మున్నా ఎందుకో గురూజీ వాటి జోలికి వెళ్ళలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.(Mahesh Babu)

మహేష్, రాజమౌళి సినిమా పూర్తి కావడానికి మూడేళ్ళు పట్టడం ఖాయం. ఈలోగా త్రివిక్రమ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సినిమాలను త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో చేయాలనీ భావిస్తున్నాడు. అలా మహేష్ తో ఫుల్ కాన్ఫిడెంట్ గా పాన్ ఇండియా సినిమా చేయాలనీ త్రివిక్రమ్ భావిస్తున్నాడు. మరి చేసిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ చేయలేకపోయిన త్రివిక్రమ్ ఈ పాన్ ఇండియా సినిమా తో మహేష్ తో హిట్ కొడతాడా అనేది చూడాలి.

Join WhatsApp