Mahesh Babu's Surprise Gift on Namrata Birthday

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటగా..సెలబ్రిటీ క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకరిగా మహేష్ బాబు నమ్రత పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఆ విషయంలో ఎప్పుడూ కూడా బయటపడరు.ఇక నమ్రత మహేష్ బాబు కంటే ఏజ్ లో పెద్దదైన కూడా ప్రేమకి వయసు అడ్డురాదు అనేలా వీరిద్దరూ ఉంటారు.

Mahesh Babu’s Surprise Gift on Namrata Birthday

అలా పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఏ చిన్న గొడవలు జరగలేదు. అయితే తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రత తన 52వ బర్త్డేని చాలా గ్రాండ్ గా జరుపుకుంది. అయితే ఈసారి నమ్రత బర్త్డేకి మహేష్ బాబు మిస్ అయ్యారు. ఎందుకంటే ఆయన జర్మనీకి వెళ్లారు. దాంతో తన భార్య బర్త్డే వేడుకల్లో పాల్గొనలేకపోయారు మహేష్. ఇక బర్త్డేకి మహేష్ బాబు నమ్రత దగ్గర లేకపోయినప్పటికీ ఆమెకు సోషల్ మీడియా ద్వారా క్యూట్ విషెస్ తెలిపారు. (Mahesh Babu )

Also Read: NTR: ఆహ్వానం అందినా ఎన్టీఆర్ అయోధ్య‌కు వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఆ హీరోనేనా..?

ఇక నమ్రత బర్త్డేకి మహేష్ బాబు చేసిన బర్త్డే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాదు మహేష్ బాబు నమ్రత బర్త్డే రోజు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ని కూడా పంపించారంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. మహేష్ బాబునమ్రత బర్త్డే రోజు ఇండియాలో ఉండననే విషయం ముందే తెలుసట.

Mahesh Babu's Surprise Gift on Namrata Birthday

అందుకే నమ్రతకి తెలియకుండా ముందుగానే ఒక డైమండ్ రింగ్ ని కొని ఆమె బర్త్డే రోజా ఇంటికి వచ్చేలా ప్లాన్ చేశారట. అలా మహేష్ బాబు ఇంటి దగ్గర లేకపోయినప్పటికీ బర్త్డే గిఫ్ట్ గా మహేష్ బాబు నమ్రతకి డైమండ్ రింగ్ ని సర్ప్రైజింగ్ గిఫ్ట్ గా పంపించారట. ఇక మహేష్ లేకపోయినప్పటికీ ఆ గిఫ్ట్ తనకి అందడంతో నమ్రత చాలా సర్ప్రైజింగ్ గా ఫీలైందట. ఇక ఆ డైమండ్ రింగ్ వ్యాల్యూ ఏకంగా కోటి రూపాయలని తెలుస్తుంది. (Mahesh Babu )

Join WhatsApp