Mamta Mohandas Hits Back at False News Reports

Mamta Mohandas: సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో సెలబ్రెటీల పైన పది రకాల వార్తలు రాయడం వల్ల ఈ ప్రభావం చాలానే చూపుతోంది. ఎక్కువగా అవాస్తవాలు దుష్ప్రచారాలు చేస్తూ సెలబ్రిటీలను సైతం ఇబ్బంది కలిగించేలా చేస్తూ ఉన్నారు..కొంతమంది కావాలని ఇలాంటి దుష్ప్రచారాలను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండు రోజుల క్రితం హీరోయిన్ రష్మిక పైన ఫేక్ వీడియోస్ సృష్టించి సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. దీంతో చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా ఫైర్ కావడం జరుగుతోంది.

ఇప్పుడు తాజాగా నటి మమతా మోహన్ దాస్ పరిస్థితి కూడా మరొక లాగా ఉన్నది.. పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈ మలయాల ముద్దుగుమ్మ సింగర్ గా కూడా మంచి పాపులారిటీ అందుకుంది.. శివం సినిమా ద్వారా విశాల్ కు జంటగా నటించి మొదట ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా పలు సినిమాలలో పాటలు పాడి హీరోయిన్ గా కూడా నటించింది. తెలుగు, కన్నడ ఇతర భాషలలో కూడా నటించిన మమతా మోహన్ దాస్ అనుకోకుండా క్యాన్సర్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి నుండి పోరాడి మరి గెలిచి మళ్లీ తన నటన వైపుగా అడుగులు వేస్తోంది.

Mamta Mohandas Hits Back at False News Reports

ప్రస్తుతం తమిళ్ మలయాళంలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న మమతా మోహన్ దాస్ గీతు నాయర్ అనే ఒక మహిళ కథాంశాన్ని రాసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..ఇక బతకలేను చావుకు లొంగిపోతున్నాను నటి మమతా మోహన్ దాస్ ఇదే దుర్భర జీవితం అని ఒక టైటిల్ తో కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయట. అయితే ఈ వార్తలు గీతు నాయర్ అనే ఒక నకిలీ ప్రొఫైల్ నుంచి షేర్ చేయబడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మమతా మోహన్ దాస్ ని కించపరిచే విధంగా ఇది ఉన్నదని తెలుపుతోంది.

Also Read: Ranapala: ఈ మొక్కతో 150 వ్యాధులకు చెక్..!!

దీనిపై మమతా మోహన్ దాస్ ఘాటుగా రిప్లై ఇస్తు.. పాపులారిటీ కోసం ప్రచారం కోసం ఇలాంటి వాటిని ఇతరుల పైన అసత్యాలు రుద్దడం సరికాదని అసలు నువ్వు ఎవరు..?మీరు దేని గురించి మాట్లాడుతున్నారు.. మీ పేజీ పై అందరి దృష్టిని ఆకర్షించడానికి తాను ఏదైనా చెప్పాలా అంటూ ఇలాంటి నకిలీ పేజీలను సృష్టించకండి అంటూ తెలియజేస్తోంది. ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయొద్దు అంటూ మమతా మోహన్ దాస్ తెలుపుతోంది.(Mamta Mohandas)

Join WhatsApp