Meera Chopra: I will not invite Charan and NTR to my wedding

Meera Chopra: మీరా చోప్రా అనే పేరు చెప్పగానే ఎవరికీ అంతగా తెలియదు..కానీ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బంగారం మూవీ హీరోయిన్ అంటే అందరికీ ఆమె ఎవరో గుర్తుకొస్తుంది. అయితే మీరా చోప్రా గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి దూరం గా ఉంది. దానికి ప్రధాన కారణం ఆమెకు అవకాశాలు రాకపోవడమే. ఇక బాలీవుడ్ లో ఎప్పుడో ఒక సినిమా చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు అంతగా హిట్ అవ్వకపోవడంతో ఈమె పేరు బాలీవుడ్ లో కూడా ఎక్కువగా వినిపించడం లేదు.

Meera Chopra: I will not invite Charan and NTR to my wedding

ఇక ఈ మధ్యకాలంలోనే బాలీవుడ్లో సఫేద్ అనే మూవీతో మన ముందుకు వచ్చింది.అయితే త్వరలోనే మీరా చోప్రా పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయాన్ని స్వయంగా మీరా చోప్రానే బయటపెట్టింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సంబంధించిన విషయాలు అయితే బయట పెట్టలేదు. కానీ తమ పెళ్ళి రాజస్థాన్ లోని ఓ ప్యాలెస్ లో ఘనంగా జరగబోతుంది అనే విషయాన్ని మాత్రం చెప్పింది. (Meera Chopra)

Also Read: Chiranjeevi: చిరంజీవి వింత గెటప్ చూసి నవ్విన బ్రహ్మానందం .. కోపంతో ఆయన ఏం చేశారంటే..?

అయితే ఇప్పటికే ఎంతోమందిని ఆహ్వానించిన మీరా చోప్రా తన పెళ్లికి ఆ ఇద్దరు హీరోలను మాత్రం పిలవడం లేదట. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా చోప్ర్ మాట్లాడుతూ.. నేను నాగార్జున, నితిన్, పవన్ కళ్యాణ్ కి నా పెళ్లి ఆహ్వానాన్ని పంపాను అని చెప్పింది. దాంతో యాంకర్ మరి ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి హీరోయలను పిలవరా అని అడిగితే.. నాకు వారితో పెద్దగా పరిచయం లేదు.

Meera Chopra: I will not invite Charan and NTR to my wedding

ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ రామ్ చరణ్ సినిమాలు నేను చాలానే చూశాను..కానీ వీరిద్దరితో నాకు పెద్దగా పరిచయం లేకపోవడంతో వారిని నా పెళ్లికి ఆహ్వానించలేదు.. అంటూ మీరా చోప్రా చెప్పుకొచ్చింది. ఇక నాగార్జున గ్రీకువీరుడు సినిమాలో ఈమె నటించింది.అలాగే నితిన్ తో మారో,పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమాలో చేసింది. అంతేకాకుండా వాన మూవీలో కూడా మీరా చోప్రా నటించిన సంగతి మనకు తెలిసిందే.(Meera Chopra)

Join WhatsApp