Mohan Babu Spoiled Producer Career Because of that Heroine

Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా కామెడీయన్ గా విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు మోహన్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. మోహన్ బాబు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారని ఇండస్ట్రీలో ఇప్పటికీ టాక్ వినిపిస్తూ ఉంటుంది. మోహన్ బాబు వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే యంగ్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది హీరోయిన్ దివ్యభారతి. మోహన్ బాబు దివ్యభారతి కాంబినేషన్లో రెండు సినిమాలు విడుదలయ్యాయి.

Mohan Babu Spoiled Producer Career Because of that Heroine

అందులో ఒకటి అసెంబ్లీ రౌడీ సినిమా ఒకటి .ఈ చిత్రాన్ని తమిళంల నుంచి తీసుకొని తెలుగులో అసెంబ్లీ రౌడీగా తెరకెక్కించారట.ఈ చిత్రాన్ని డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వం వహించారు.అయితే ఇందులోని పాటలు అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దివ్యభారతి హీరోయిన్గా ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. మోహన్ బాబు కూడా కలెక్షన్ కింగ్ గా కూడా ఈ సినిమాతో పేరును మార్చుకున్నారు.

Also Read: Amazon Sale 2024: ఈ ల్యాప్ టాప్ పై భారీ తగ్గింపు.. త్వరపడండి..!

తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్ పైనే మోహన్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివ్యభారతి మోహన్ బాబు కాంబినేషన్ బాగానే వర్కౌట్ అయిందని టాక్ అప్పట్లో వినిపించింది. ఈ సినిమా కోసం మోహన్ బాబు భారీగానే డబ్బులను ఖర్చు పెట్టారట. అందుకే ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు కూడా ఎవ్రీ గ్రీన్ సాంగ్స్ గా మిగిలిపోయాయి. ముఖ్యంగా దివ్యభారతి కోసమే ఈ సినిమాని మళ్లీమళ్లీ ప్రేక్షకుల సైతం ఎక్కువగా చూస్తూ ఉండేవారట.

Mohan Babu Spoiled Producer Career Because of that Heroine

అలా అసెంబ్లీ రౌడీ సినిమా విజయం సాధించగానే దివ్యభారతి కోసం ఎంతోమంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఆమె డేట్ల కోసం వెయిట్ చేసేవారట. అప్పటికే ఇమే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. బాలయ్య చిరంజీవి వెంకటేష్ వంటి హీరోలతో నటించిన దివ్యభారతి వీరందరితో ఒక్కొక్క సినిమాలో నటించిన మోహన్ బాబుతో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యింది. ఆ సినిమానే చిట్టెమ్మ మొగుడు. ఈ సినిమాని కూడా తమిళం నుంచి తీసుకొని తెలుగులో వేరే నిర్మాత తో డబ్బులు పెట్టించి మరి మోహన్ బాబు తెరకెక్కించారట. ఇందులో హీరోయిన్గా దివ్యభారతి అయితేనే చేస్తానని చెప్పడంతో ఆమె కోసమే ఈ సినిమా తీసినట్లు సమాచారం. సినిమా తీసి దారుణమైన డిజాస్టర్ ని మూటగట్టుకున్న నిర్మాత అప్పటివరకు సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారట. దీంతో దివ్యభారతి కోసం మోహన్ బాబు ఆ నిర్మాతను ముంచేశాడనే టాక్ అప్పట్లో వినిపించింది. మరి ఆ నిర్మాత ఎవరనే విషయం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. (Mohan Babu)

Join WhatsApp