Mrunal Thakur About Bollywood Offers

Mrunal Thakur: మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీతారామం సినిమాతో మృణాల్ సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ అనంత‌రం మృణాల్ ఠాకూర్‌.. హాయ్ నాన్నతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. న్యాచుర‌ల్ స్టార్ నాని ఇందులో హీరోగా న‌టించాడు. ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. సీతారామంలో సీత‌గా, హాయ్ నాన్న‌లో య‌శ్నాగా మృణాల్ తన పాత్రల్లో ఇమిడిపోయి తెలుగింటి అమ్మాయిగా ముద్ర వేయించుకుంది.

Mrunal Thakur About Bollywood Offers

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్ర‌స్తుతం రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫ్యామిలీ స్టార్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే తెలుగులో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్న మృణాల్‌.. బాలీవుడ్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో స‌త్తా చాట‌లేక‌పోతోంది. తాజాగా ఇదే విష‌యంపై మృణాల్ త‌న ఆవేద‌నంతా వెల్ల‌గ‌క్కింది.

Also Read: Padma Vibhushan: చిరంజీవి కంటే ముందు పద్మ విభూషణ్ పుర‌స్కారాన్ని అందుకున్న హీరోలు వీళ్లే!

ఓ ఇంట‌ర్వ్యూలో మృటాల్‌ మాట్లాడుతూ.. సీతారామం, హాయ్ నాన్న లాంటి మ‌న‌సుకు హత్తుకునే ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. అయితే బాలీవుడ్ లో మాత్రం రొమాంటిక్ చిత్రాల్లో ఛాన్సులు రావ‌డం లేదు. హిందీలో ఎన్నో సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నా.. అంద‌మైన ల‌వ్ అండ్ రొమాంటిక్ స్టోరీలు మాత్రం రావ‌డం లేదు. ఇప్ప‌టికే ఈ జాన‌ర్ స్టోరీల కోసం ఎంతో మందిని అడిగాను. కానీ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.(Mrunal Thakur)

Mrunal Thakur About Bollywood Offers

బహుశా నేను హిందీలో ఇంకా అంతగా ఫేమస్ కాలేదేమో అనిపిస్తుంది. లవ్ స్టోరీస్ చేయాలంటే తనకు ఎంతో ఇష్టం. సీతారామం, హాయ్ నాన్న లాంటి క‌థ‌లు ఇత‌ర భాష‌ల్లోనూ త‌న‌కు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే త‌న‌ను క్విన్ ఆఫ్ రొమాన్స్ అని పిలుస్తున్నార‌ని.. ఈ పిలుపు నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంద‌ని మృణాల్ పేర్కొంది. కాగా, ప్ర‌స్తుతం మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో పూజా మేరీ జాన్ అనే మూవీలో న‌టిస్తోంది. పోస్ట్ ప్రొడెక్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Join WhatsApp