Mrunal Thakur dress design

Mrunal Thakur: మృణాల్ ఠాగూర్ తాజాగా ముంబైలో జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మెరిసింది.మరీ ముఖ్యంగా ఈమె వేసుకున్న డ్రెస్ అందరిలో అట్రాక్టివ్ గా కనిపించడంతో ఆమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం మృణాల్ ఠాగూర్ కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈమె వేసుకున్న డ్రస్ ఎంతో బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Mrunal Thakur dress design

అంతేకాదు అప్సరసలా మెరిసిపోతుందని,ఆ దేవకన్యే నేల మీద దిగివచ్చి నడుస్తున్నట్టు ఉంది అంటూ ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. అయితే అందర్నీ ఆకర్షించిన మృణాల్ ఠాగూర్ వేసుకున్న డ్రస్సు తయారు చేయడానికి ఎన్ని గంటలు పట్టిందో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే.మరి ఇంతకీ మృణాల్ ఠాగూర్ వేసుకున్న డ్రెస్ తయారు చేసింది ఎవరు? అది తయారు చేయడానికి ఎన్ని గంటల సమయం పట్టిందో ఇప్పుడు చూద్దాం.. (Mrunal Thakur)

Also Read: Rakul Preet Singh: రకుల్ పై మోజుపడి 3 కోట్ల లగ్జరీ ఇల్లు కొనిచ్చిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే..?

మృణాల్ ఠాగూర్ శనివారం రోజు ముంబైలో జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొంది. ఇక ఈ ఈవెంట్లో మృణాల్ రెడ్ కలర్ లెహంగా వేసుకొని అందరినీ తన వైపే కళ్లప్పగించుకుని చూసేలా తన అందంతో పడగొట్టేసింది. అయితే తాను అంత అందంగా కనిపించడానికి కారణం తన డ్రెస్సే అని, ఆ డ్రెస్ తయారు చేసింది తన ఫ్యాషన్ డిజైనర్ అను అని, ఈ క్రెడిట్ మొత్తం ఆమెకే అంటూ మృణాల్ ఠాగూర్ అందరి ముందే చెప్పేసింది.

Mrunal Thakur dress design

ఇక మృణాల్ వేసుకున్న రెడ్ లెహంగా తయారు చేయడానికి దాదాపు 1400 గంటల సమయం పట్టిందని కూడా చెప్పింది. 1400 గంటలు అంటే దాదాపు రెండు నెలలు..ఇక ఒక్క డ్రెస్ తయారు చేయడానికే అన్ని రోజులా అని ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ నోరెళ్ళబెడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే మృణాల్ ఠాగూర్ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ మూవీ తో ఆడియన్స్ ని పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మృణాల్ ఠాగూర్ పూజా మేరీ జాన్ అనే మూవీలో నటిస్తుంది.(Mrunal Thakur )

Join WhatsApp