Mrunal Thakur's interesting comments

Mrunal Thakur: కొంతమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గలుచుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం వరస పెట్టి సినిమాలు చేస్తూ హ్యాట్రిక్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో ఈ బ్యూటీ కి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ అంతకుముందు ఈ బ్యూటీ హిందీలో పలు హిట్ చిత్రాలు చేసి మంచి గుర్తింపు నే సంపాదించుకుంది. ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.

Mrunal Thakur’s interesting comments

మృణాల్ అభిమాన నటుడు షాహిద్ కపూర్ అని వెల్లడించింది ఈ బ్యూటీ. అదేవిధంగా ఇదే క్రమంలో ఆయనతో కలిసి నటించిన జెర్సీ సినిమా అన్ లొకేషన్ అనుభవాన్ని మీడియా ముందు బయటపెట్టింది. షాహిద్ తో జరిగిన సీన్స్ గుర్తుచేసుకుంది. షాహిద్ అంటే తనకు చాలా ఇష్టమని.. అలాంటి తనకు అతడితో కలిసి నటించే అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పేసానని వెల్లడించింది ఈ అమ్మడు.

Also Read: Pink lips: గులాబి రంగు గల పెదాలను పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

షాహిద్ నవ్వు అంటే తనకి ఎంతో ఇష్టమని… లొకేషన్ లో ఆయన నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయే దాన్ని.. సినిమాల్లోనే కాకుండా రియల్ గా కూడా ఆయన నవ్వు చాలా బాగుంటుందని తెలిపింది. ఇక ఒక సీన్ లో షాహిద్ను కొట్టాలని.. కానీ ఆసీన్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపింది.‌ ఆ ఒక్క సీన్ చేయడానికి దాదాపు మూడు గంటలకు పైగా సమయం తీసుకున్నట్లు ఈ బ్యూటీ వెల్లడించింది. షాట్ బాగా రావడానికి రెండు మూడు సార్లు కొట్టాల్సి వచ్చిందని.. తన జీవితంలో నటిగా బాగా ఇబ్బంది పడ్డ సీన్ అదే అంటూ వెల్లడించింది.

Mrunal Thakur's interesting comments

ప్రస్తుతం ఈ అమ్మడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మృణాల్ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి ముందు హాయి నాన్న మూవీతో భారీ సక్సెస్ ని అందుకున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా ఫ్లాప్ లిస్టులో చేరింది. అప్పటివరకు హిట్ చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోయిన ఈ అమ్మడు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ సినిమాతో మళ్లీ తన క్రేజ్ ని చాటి చెబుతుందో లేదో చూడాలి మరి.(Mrunal Thakur)

Join WhatsApp