Nagarjuna quarrel with Amala

Amala: చాలా మంది సెలబ్రెటీలు వారి జీవితంలో జరిగిన కొన్ని కొన్ని రహస్య విషయాలను అప్పుడప్పుడు పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలో బయటపెడుతూ ఉంటారు.అయితే అలాంటి ఒక విషయాన్నే అక్కినేని అమల కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దాని కారణంగా దాదాపు నెల రోజులు నాగార్జున నేను మాట్లాడుకోలేదని, ఇద్దరి మధ్య అసలు మాటలు లేవు అనే ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది అమల.ఇక ఈ వార్త విన్న చాలా మంది నెటిజన్స్ ఏంటి ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కూడా ఇలాంటి గొడవలు ఉంటాయా..

Nagarjuna quarrel with Amala

నిజంగానే నాగ్ అమల ఇద్దరు నెలరోజుల పాటు మాట్లాడుకోలేదా..అంటూ షాక్ అవుతున్నారు.మరి ఇంతకీ అమలా నాగార్జున మధ్య చిచ్చుపెట్టిన ఆ విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో అక్కినేని అమల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అఖిల్ చిన్నతనంలో ఉన్నప్పుడు వాడు ఆడుకోవడానికి ఇంట్లో ఎన్నో కుక్క పిల్లలు ఉండేవి. ఇక అన్ని కుక్కలు ఉన్నా కూడా నాగార్జున ప్రేమతో మరో కుక్కని తీసుకువచ్చారు.ఇక ఇంట్లో ఉన్నవన్నీ ఇండియన్ కుక్కలు అయినప్పటికీ నాగ్ తీసుకొచ్చింది మాత్రం లాబ్రాడార్ జాతికి చెందిన డాగ్.. ( Amala)

Also Read: Amitabh Bachchan: కోట్లు ఖర్చుపెట్టి ముంబైలో స్థలం కొన్న అమితాబ్ బచ్చన్.. ధర ఎంతంటే..?

ఇక ఈ డాగ్ అంటే నాగార్జునకి చాలా ఇష్టం. ప్రతిరోజు ఆయన ఇంటికి రావడంతోనే ఆ డాగ్ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేది. కానీ ఇంటికి కొత్త వారు ఎవరు వచ్చినా కూడా వారి మీదకి అరవడం, వారి మీదకు పరిగెత్తుకుంటూ వెళ్లడం చేసేది. దాంతో ఓ రోజు నాగార్జునకు చెప్పకుండానే దాన్ని ట్రైనింగ్ కి పంపించేసాను. దాంతో ఇంటికి రావడంతోనే ఈ విషయం గ్రహించిన నాగార్జున నాకు తెలియకుండా ఈ పని ఎందుకు చేసావు అని నాతో గొడవ పెట్టుకున్నారు.

Nagarjuna quarrel with Amala

ఇక జరిగిన విషయం మొత్తం చెప్పినా కూడా నాగ్ పట్టించుకోకుండా నాపై అరవడం స్టార్ట్ చేశారు. ఇదాదాపుగా నెల రోజులపాటు ఆ కుక్క ట్రైనింగ్ కి వెళ్ళింది. ఇక ఆ నెలరోజుల పాటు కూడా నాగార్జున నాతో ఒక్క మాట మాట్లాడలేదు.ఎప్పుడైతే ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆ కుక్క ఇంటికి వచ్చిందో ఆ టైంలోనే నాతో మాట్లాడారు. అలా కుక్క విషయంలో మా మధ్య దాదాపు నెలరోజులు మాటల్లేవు..అంటూ అప్పట్లో అమల చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక అమల సినిమాలకు పులిస్టాప్ పెట్టాక జంతు సంరక్షకురాలిగా మారిన సంగతి మనకు తెలిసిందే.( Amala)

Join WhatsApp