Nagarjuna Speech At Naa Saami Ranga Success Celebrations

Nagarjuna: గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక ఎంత‌గానో స‌త‌మ‌తం అవుతున్న అక్కినేని మ‌న్మ‌థుడు నాగార్జున‌.. ఫైన‌ల్ గా ఇటీవ‌ల విడుద‌లైన నా సామి రంగ మూవీతో విజ‌యాన్ని అందుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. నాగార్జున‌, ఆషికా రంగనాథ్ జంట‌గా న‌టిస్తే.. అల్ల‌రి న‌రేష్‌, రాజ్ త‌రుణ్‌, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

Nagarjuna Speech At Naa Saami Ranga Success Celebrations

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ ను ఈ మూవీని లాంచ్ చేశారు. మూడు నెల‌ల్లోనే షూటింగ్ మ‌రియు పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసి 2024 సంక్రాంతి బ‌రిలో దింపారు. జ‌న‌వ‌రి 14న గ్రాండ్ రిలీజ్ అయిన నా సామి రంగ మూవీకి మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయితే సంక్రాంతి సీజ‌న్ సినిమాను కాపాడేసింది. ఫెస్టివ‌ల్ వైబ్ కు త‌గ్గ‌ట్లుగా సినిమా ఉండ‌టంతో నా సామి రంగ బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిలిచింది.

Also Read: Tamannaah: ఫైన‌ల్ గా పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్‌.. అలా హింట్ ఇచ్చేసిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా!

బ్రేక్ ఈవెన్ అవ్వ‌డ‌మే కాకుండా లాభాల బాట ప‌ట్టింది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ ఆదివారం నాడు స‌క్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాగార్జున్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. హిట్ వ‌చ్చినా.. ఫ్లాప్ వ‌చ్చినా ఎప్పుడూ త‌న‌ వెన్నంటే ఉండే అక్కినేని అభిమానుల‌కు మ‌రియు నా సామి రంగ మూవీని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు నాగార్జున మొద‌త బిగ్ థ్యాంక్స్ చెప్పారు.(Nagarjuna)

Nagarjuna Speech At Naa Saami Ranga Success Celebrations

ఆపై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20న నాన్నగారి పుట్టినరోజు నాడే ఈ చిత్రాన్ని లాంచ్ చేశాం. ఒకవైపు నాన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణలో మా ఫ్యామిలీ అంతా బిజీగా ఉన్నారు. ఈ రోజు నా సామిరంగ లాంచ్ ఈవెంట్ ఉంద‌ని ఎవ‌రికీ తెలియ‌దు. స్టాచ్యూ ఆవిష్కరణ అయిన వెంట‌నే నేను బ‌య‌లు దేర‌గా అమ‌ల ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగింది. ఇలా మూవీ లాంచ్ ఉంది వెళ్ళాలి అంటే.. అదేదో సాయంత్రం వెళ్లొచ్చు కదా? అని అమల అంది. లేదు వెళ్ళాలి.. ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలి అని అన్నాను. ఆ మాట‌తో అమ‌ల‌, అక్క‌డే ఉన్న చైతు, అఖిల్ కూడా న‌న్నొక పిచ్చోడిలా చూశారు. మూడు నెల‌ల్లో సినిమాను పూర్తి చేసే రిలీజ్ చేయ‌డం అంటే అయ్యే ప‌ని కాద‌ని అంద‌రూ అనుకున్నారు. ఎవ‌రూ న‌న్ను న‌మ్మ‌లేదు. కానీ, మా టీమ్ లో న‌మ్మ‌కం ఉంది. ఆ న‌మ్మ‌కంతోనే అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కీరవాణి గారు మ‌రియు డిస్ట్రిబ్యూటర్స్ త‌మ‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించారు అంటూ నాగార్జున చాలా ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కాస్త వైర‌ల్ గా మారాయి. (Nagarjuna)

Join WhatsApp