Nagarjuna Was Jailed Because of that Director

Nagarjuna: ఏంటి నాగార్జున జైలు పాలయ్యారా.. ఎందుకు నాగార్జున జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. ఇంతకీ ఏ డైరెక్టర్ వల్ల నాగార్జున జైలుకు వెళ్లారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున జైలుకు వెళ్లారు అంటూ వస్తున్న వార్తల్లో నిజమే ఉంది.కానీ ఆయన నిజ జీవితంలో కాదు..సినిమా షూటింగ్ కోసం ఆయన చంచల్ గూడా జైలుకు వెళ్లారట.మరి ఇంతకీ అసలు విషయం ఏంటా అనుకుంటున్నారా.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీడేస్,ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ వంట సినిమాలతో యూత్ లో మంచి ఇమేజ్ సంపాదించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటే అందరికీ తెలుసు.

Nagarjuna Was Jailed Because of that Director

ఈయన తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంచి యూత్ అలాగే పెద్దవాళ్లు మెచ్చే సినిమాలను తీశారు.అలా ఈయన దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే అలాంటి శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో D 51 అనే మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలకపాత్రలో నటించ బోతున్నారట. (Nagarjuna)

Also Read: Double Ismart: హాట్ టాపిక్ గా డ‌బుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ బ‌డ్జెట్‌.. ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారో తెలుసా?

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు రెండు మూడు రోజులు తన డేట్స్ ఇచ్చారట నాగార్జున. అలా నాగార్జునకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు చంచల్ గూడా జైల్లో తెరకెక్కిస్తున్నారట. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున నటించిన మొదటి సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాని అమిగోస్ క్రియేషన్స్,శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Nagarjuna Was Jailed Because of that Director

పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న D51 మూవీలో ధనుష్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. అలా ఈ మూవీలో నాగార్జున కీలకపాత్రలో చేస్తున్నారు దాంతో ఆయనకి సంబంధించిన సన్నివేశాన్ని జైలులో తెరకెక్కిస్తున్నారట.అయితే ఈ విషయం తెలియని కొంతమంది నిజంగానే నాగార్జున జైలుకు వెళ్లారా అని అయోమయంలో పడిపోయారు.

Join WhatsApp