Nani and Sujeeth Movie Will be Late Because of 'OG'

Nani: నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలు అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది. నానితో పాటు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ కు కూడా మంచి పేరొచ్చింది. కొత్త దర్శకుడు సౌర్యవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విడుదలైన తర్వాత ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండగా అందుకు తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Nani and Sujeeth Movie Will be Late Because of ‘OG’

ఇకపోతే నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి ధనయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మరో ఇద్దరు క్రేజీ డైరెక్టర్లతో నాని సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మళ్ళీ డివివి దానయ్య బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు కమిట్ అయినట్లు కనిపిస్తోంది.

దీనికి సంబంధించిన కథ దాదాపు లాక్ అయినట్లు చెప్పారు. ఇది మాత్రమే కాకుండా బలగం సినిమాతో సూపర్ పాపులర్ అయిన దర్శకుడు వేణుతో నాని ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే వేణు కూడా నానికి కథ చెప్పాడని షూటింగ్ కి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలను ఒకే సారి కాకుండా సుజిత్ సినిమా ను లేట్ గా చేసే ఆలోచన లో నాని ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒజీ సినిమా చేయడానికి సుజీత్ కి చాలా సమయం పట్టేలా ఉంది. సుజీత్ తో వెళితే మరో రెండు మూడు నెలలు ఖాళీగా ఉండాలి. అది ఇష్టం లేకనే వేణు సినిమా ముందుగా చేయాలనీ నాని భావిస్తున్నాడట.(Nani)

Join WhatsApp