Naresh: I got into Relationship with Pavitra Only for their Money

Naresh: గత రెండు మూడు సంవత్సరాలుగా నరేష్, పవిత్ర లోకేష్ విషయంపై ఎన్ని తెలియని విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరిద్దరి మ్యాటర్ అచ్చం సినిమాల్లో జరిగినట్టే జరుగుతుంది. నరేష్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయినా కూడా పవిత్ర పై ప్రేమ పుట్టింది. మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రను నాలుగో పెళ్లి చూసుకోవాలని భావించారు.ఇక పవిత్ర కు కూడా పెళ్లి జరిగినప్పటికీ ఆమె కూడా నరేష్ పై ప్రేమ పెంచుకుంది. వీరిద్దరూ ప్రస్తుతం సహ**వనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Naresh: I got into Relationship with Pavitra Only for their Money

అయితే నరేష్ పవిత్ర ప్రేమ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సమయంలో చాలామంది నెటిజన్స్ పవిత్ర లోకేష్ నరేష్ డబ్బు మీద కన్నేసే ఆయనతో ప్రేమలో పడిందని, డబ్బు కోసమే ఆయనతో ఉంటుందని కామెంట్స్ పెట్టారు. అంతేకాదు పవిత్ర లోకేష్ భర్త కూడా పవిత్ర కి లగ్జరీగా బతకడం, డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉంటుంది.అందుకే నన్ను వదిలేసి ఎక్కువ డబ్బున్న నరేష్ ని పట్టుకుందని చెప్పారు.అయితే ఈ విషయాలన్నింటిపై నరేష్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Also Read: Samantha: రూ. 12 కోట్లు న‌ష్ట‌పోయిన స‌మంత‌.. ఫుల్ ఖుషీలో ఆ స్టార్ హీరోయిన్‌?!

చాలామంది పవిత్ర లోకేష్ నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్పుకొచ్చారు.అయితే నాకంటే పవిత్ర లోకేష్ ఫ్యామిలీకి ఎక్కువ డబ్బు ఉంది.నేనే వాళ్ళ డబ్బు కోసం పవిత్రను పెళ్లి చేసుకొని ఉండవచ్చు కదా.. అలా ఎందుకు మీరు అనుకోవడం లేదు అని అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు పవిత్ర లోకేష్ కి తనకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, మా అమ్మలాగే పవిత్ర లోకేష్ నన్ను చూసుకుందని, డబ్బు అనేది మ్యాటర్ కాదు.

Naresh: I got into a relationship with Pavitra only for their money

పవిత్ర క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది.ఆమె నాకు అన్ని విషయాల్లో సపోర్టివ్ గా ఉంటూ ధైర్యం చెబుతుంది. ఈ క్వాలిటీస్ అన్ని మా అమ్మలో ఉండేవి.ఇప్పుడు పవిత్రలో చూస్తున్నాను.అందుకే నాకు పవిత్ర బాగా నచ్చింది.డబ్బు అనేది అసలు విషయమే కాదు. మా ఇద్దరికీ డబ్బులు ఎక్కువగానే ఉన్నాయి. దాన్ని మేము ఇండస్ట్రీ కోసం ఖర్చు పెడుతున్నాం. అలాగే మేము మంచి పొజిషన్లో ఉన్నాం.. కోట్లు సంపాదిస్తున్నాం.. అంటూ నరేష్ పవిత్ర లోకేష్ గురించి వచ్చిన చెడు కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు.(Naresh)

Join WhatsApp