Navdeep comments on Rana Daggubati 's wedding

Rana Daggubati: దగ్గుపాటి రానా.. పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న రానా ప్రస్తుతం కొంచెం స్లో అయ్యాడు. బాహుబలి మూవీ లో బల్లాల దేవ పాత్రలో పోషించి మెప్పించిన రానా ఫ్యాన్ బేస్ మనందరికీ తెలిసిందే.

Navdeep comments on Rana Daggubati ‘s wedding

సినిమాల్లో హీరోగా నటిస్తేనే పాపులారిటీ దక్కదని విలన్స్ రోల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకోవచ్చని నిరూపించాడు రానా. ఇక మరో పక్క పెళ్లంటేనే ఆమడ దూరం పారిపోయే నవదీప్ కూడా మనందరికీ సుపరిచితమే. వయసు మీద పడుతున్నప్పటికీ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. పెళ్లెప్పుడు అని అడుగుతుంటే ప్రభాస్ తర్వాత అంటూ దాటేస్తున్నాడు.

Also Read: Ram pothineni: బుల్లితెర యాక్టర్ కు సైట్ కొడుతున్న రామ్.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

నిజానికి నవదీప్ కి పెళ్లంటేనే ఓ జైలు శిక్ష లాగా భావిస్తాడు. మరి ఈయనకి ఆ ఫీలింగ్ ఎందుకు కలిగిందో తెలియదు కానీ ఇప్పట్లో అయితే నవదీప్ పెళ్లి చేసుకునేదట్లు కనిపించడం లేదు. ఇక ఎవరైనా సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటే వారిపై స్పందిస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే రానా ఓ షోలో పాల్గొని..” నా లైఫ్ లో అన్ని చేసేసా.

Navdeep comments on Rana Daggubati 's wedding

ఇక చెయ్యంది ఏదైనా ఉంది అనుకుంటే అది పెళ్లి ఒకటే. అందుకే పెళ్లి కూడా చేసేసుకున్న ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి నవదీప్ స్పందిస్తూ..” గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది షేవింగ్ కానీ పెళ్లి కాదు. దురద పుట్టినప్పుడు గోక్కోవాలి కానీ గోర్లు పీకేసుకోకూడదు ” అంటూ రానా పెళ్లిపై కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Join WhatsApp