Nayanthara who entered the ring once again

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ ని కూడా ఫుల్ గా కవర్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా జిక్యూ నిర్వహించిన మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ యంగ్ ఇండియన్స్ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నయనతార తన గ్లామర్ దోస్తో అదరగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక మొన్నటి వరకు నయనతార భర్త తో విడిపోతున్నట్లు అనేక వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Nayanthara who entered the ring once again

అంతేకాకుండా తాజాగా నయనతార భర్తను ఇన్స్టాలో అన్ ఫాలో చేయడం.. మళ్లీ కొద్దిసేపటికి ఫాలో చేయడం ప్రేక్షకులలో అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇక మరో విషయం ఏమిటంటే.. ఈమె తాజాగా తన instagram పోస్ట్ లో.. నేను సర్వం కోల్పోయాను.. అని ఓ పోస్ట్ ని పెట్టింది. మళ్లీ దీన్ని డిలీట్ చేయడంతో ఆ వార్తలకు ఆద్యం పోసినట్లు అయ్యింది. తాజాగా పుకార్లన్నిటికీ ఆమె పుల్ స్టాప్ పెట్టింది. నయనతార కవల పిల్లలతో కలిసి వెకేషన్ కు ఫారిన్ ట్రిప్ వెళ్ళినట్లు తెలుస్తుంది.

Also Read: Mrunal Thakur: నాకు అతను అంటే పిచ్చి.. అతనిలో అది చూస్తూనే ఉండిపోతా.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే.‌.. ఈ బ్యూటీ తాజాగా జవాన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నపూర్ణ ది గాడెస్ అప్ ఫుడ్ అనే టాగ్లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆ మధ్య విడుదల పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Nayanthara who entered the ring once again

ఈ బ్యూటీ తెలుగులోకి విక్టరీ వెంకటేష్ మరియు వినాయక్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరస సినిమాలు చేసుకుంటూ తెలుగు మరియు తమిళ్ భాషల్లో దూసుకుపోయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా నయనతార ఆరబోసిన అందాలుకి ప్రతి ఒక్కరు ఫీదా అవుతున్నారు. ఇప్పటివరకు ఎంతో సాంప్రదాయ పద్ధతిలో కనిపించిన ఈ అమ్మడు ఒక్కసారిగా గ్లామర్ దోస్‌ పెంచేసింది. దీంతో మరోసారి నయనతార ఫామ్ లోకి వచ్చింది.. ఇక ఆపడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Nayanthara)

Join WhatsApp